Pragathi: పొట్టి స్కర్ట్ లో మతిపోగొట్టేసిన ప్రగతి.. అదిరిపోయే స్టెప్పులు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమంలో మంచి గుర్తింపును అందుకున్న వారు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే కేవలం వెండితెరపై మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన వారిలో ప్రగతి ఒకరు. ఇక ఆమె మరోసారి గ్లామరస్ లుక్కుతో డాన్స్ చేస్తూ షాక్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ లుక్స్

గ్లామర్ లుక్స్

సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరైన ప్రగతి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో విభిన్నమైన ఫోటోలను వీడియోలను షేర్ చేసుకుంటూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎక్కువగా తల్లి పాత్రలలో అలాగే పాజిటివ్ పాత్రలలో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం ఊహించని విధంగా గ్లామర్ లుక్స్ కూడా షాక్ ఇస్తూ ఉంటారు.

వయసు ఎంతంటే..

వయసు ఎంతంటే..

ప్రగతి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఆమె వయసు ఐదు పధుల్లోకి వచ్చింది అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 30 దాటిన వారిలా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతగానో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అందరికీ తెలిసిందే.

 హీరోలకు తల్లిగా

హీరోలకు తల్లిగా

జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ పోస్ట్ చేసిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కేవలం సినిమాలతోనే కాకుండా ఆమె పలు సీరియల్స్ తో కూడా మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక మొదట 2002లో బాబి అనే సినిమా ద్వారా పరిచయమైన ప్రగతి ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు తల్లి పాత్రలలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. ఇక ఆమె ముఖ్యంగా శ్రీనువైట్ల సినిమాలలో కూడా మంచి కామెడీ టైం ఉన్న పాత్రల్లో కనిపించారు.

 పేరు తెచ్చిన సినిమాలు

పేరు తెచ్చిన సినిమాలు

ఏమైంది ఈవేళ, శక్తి, మిస్టర్ పర్ఫెక్ట్, కందిరీగ, రేసుగుర్రం బాద్ షా, దేనికైనా రెడీ, జూలాయి, అందాల రాక్షసి దూకుడు, బెంగాల్ టైగర్, సౌఖ్యం బృందావనం, ఓ బేబీ అర్జున్ సురవరం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, F 2 వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు అందుకున్నారు. ప్రత్యేకంగా ఎఫ్ 3 సినిమాలో కూడా హీరోయిన్ తల్లిగా నవ్వులు పూయించిన విషయం తెలిసిందే.

పొట్టి స్కట్ లో డ్యాన్స్

పొట్టి స్కట్ లో డ్యాన్స్

ఇక రీసెంట్ గా మరోసారి ఆమె ఒక వీడియోతో అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. దిల్ సే సినిమాలోని సాంగ్ తో ప్రగతి వేసిన స్టెప్పులు మామూలుగా లేవు. అందులోనూ ఆమె ఫస్ట్ టైం ఒక పొట్టి స్కట్ లో కనిపించారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అసలు నిజంగా అందులో ఉన్నది ప్రగతి గారేనా.. చూస్తే నమ్మలేకపోతున్నాము అంటూ నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

 మెగాస్టార్ సినిమాలో..

మెగాస్టార్ సినిమాలో..

ఇక ప్రస్తుతం ప్రగతి ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే తమిళంలో తెలుగు మలయాళం సినిమాల్లో కూడా బిజీగా కొనసాగుతున్నారు. మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ ఉన్నప్పుడు ఈ తరహా వీడియోస్ తో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X