Jani Master: జానీ మాస్టర్‌పై అలాంటి కుట్ర.. తొలిసారి నోరు విప్పిన భార్య. సంచలన వ్యాఖ్యలు
Jani Master: నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న జానీ మాస్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు, బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జానీ మాస్టర్ భార్య సుమలత సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ పై అత్యాచారానికి పాల్పడ్డరనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 2017లో'ఢీ'షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమయ్యాడనీ, తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి జానీ మాస్టర్ తనని హైదరాబాద్‌కు పిలిపించారని బాధితురాలు పేర్కొంది.

ఈ క్రమంలో 2019లో జానీ మాస్టర్ తన టీంలో చేర్చుకున్నట్టు బాధిత యువతి పేర్కొంది. అవుట్ డోర్ షూటింగ్ లో పేరుతో చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు తిప్పుతూ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ప్రతిఘటిస్తే జానీ మాస్టర్ తీవ్రంగా దాడి చేశాడని, పలు సందర్బాల్లో జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని భాధితురాలు పేర్కొంది.
అలాగే.. మత మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జాన్ మాస్టర్ వేధింపులకు పాల్పడేవాడనీ, పలు మార్లు దాడి చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తనని పెళ్లి చేసుకోకపోతే.. ఇండస్ట్రీలో లేకుండా చేశానని భయాభంత్రులకు గురి చేశాడని ఆరోపించింది. ఈ క్రమంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. దీంతో ఈ అంశం అటు సీని, రాజకీయ పరంగా హాట్ టాపిక్ గా మారింది.
జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాతో మాట్లాడుతూ.. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తి కాదని, కావాలని ఆయనపై నెగిటివిటీ చాలా స్పెడ్ చేస్తున్నారని అన్నారు. ఆయన పది మందికి ఉపయోగపడే పనులే చేశారు కానీ, ఇలాంటి పనులు చేయరని జానీ మాస్టర్ భార్య అన్నారు. ఆయన మంచితనం, టాలెంట్ ను చూసే స్టార్ హీరోలు జాని మాస్టర్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ను అణగదొక్కాలని భావిస్తున్నారనీ, ఆంధ్ర, తెలంగాణ అనే ఫీల్ ను లేవనెత్తున్నారని అన్నారు.
అసోసియేషన్ కు అది చేస్తున్నా.. అది చేస్తానని జానీ మాస్టర్ మాట ఇచ్చిన విషయం వాస్తవమే కానీ, కొన్ని పనులు కాస్త లేట్ కావొచ్చు అంత మాత్రాన ఆయనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. యూనియన్ గానీ, అసోషియన్ గానీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని, ప్రతి విషయంలో క్రమశిక్షణగా ఉంటారు. తన విద్యార్థులు కూడా అలాగే ఉండాలని భావిస్తారని, కానీ విషయం కొంత మందికి నచ్చడం లేదని అన్నారు. అయితే.. గతంలో జానీ మాస్టర్ అసోసియేషన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన భార్య మాట్లాడిన వీడియో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











