twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. చికిత్స పొందుతూ శివశంకర్ మాస్టర్ మృతి.. 1000 సినిమాలకు!

    |

    టాలీవుడ్ లో మరో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది.. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆదివారం నాడు సాయంత్రం 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    Choreographer Shiva Shankar Master శివైక్యం... ప్రముఖుల సంతాపం!! || Filmibeat Telugu
     ఏ ఐ జి హాస్పిటల్ లో

    ఏ ఐ జి హాస్పిటల్ లో

    టాలీవుడ్ సహా దక్షిణాది భాషల్లో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తూ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో పనిచేసిన కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా సోకడంతో ఊపిరితిత్తుల సమస్య కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది గా ఫీల్ అవుతున్న ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఊపిరితిత్తులు చెడిపోవడంతో

    ఊపిరితిత్తులు చెడిపోవడంతో

    అయితే ఆయన ఊపిరితిత్తులు దాదాపు 75 శాతం చెడిపోవడంతో ఆయనను డాక్టర్లు కాపాడలేకపోయారు. శివ శంకర్ మాస్టర్ చికిత్సకు రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో అంత స్తోమత మాకు లేదు అని శివ శంకర్ మాస్టర్ కుమారుడు మీడియా ద్వారా తెలుగు సినీ పెద్దలను కోరడంతో ముందుగా సోను సూద్ ఈ విషయం మీద స్పందించారు. ఆయనకు ఆనారోగ్యానికి జరుగుతున్న చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. అదే విధంగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి అయితే స్వయంగా ఇంటికి పిలిపించుకుని మూడు లక్షల రూపాయల చెక్కు కూడా అందించారు.

    1000 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా

    1000 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా

    అయితే అనూహ్య పరిస్థితుల లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శివ శంకర్ మాస్టర్ కన్నుమూసినట్లుగా మీడియాకు వార్తలు వచ్చాయి. తన కెరీర్ మొత్తం మీద దాదాపు పది భాషలలో వెయ్యికి పైగా సినిమాలకు పనిచేసిన శివ శంకర్ మాస్టర్ సినీ ప్రస్థానం 1975వ సంవత్సరంలో మొదలైంది మూడు దశాబ్దాలకు పైగా ఆయన 1000 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు అంటే ఆయన ఎంత సీనియర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు.

    జాతీయ అవార్డు

    జాతీయ అవార్డు


    మగధీర సినిమాలోని ధీర ధీర అనే సాంగ్ కంపోజ్ చేసిన శివ శంకర్ మాస్టర్ ఆ పాటకు జాతీయ అవార్డు దక్కించుకున్నారు. అలా దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన ఆయన ఆ సినిమా పాట ద్వారా జాతీయ అవార్డు సాధించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇండియన్ సినిమా ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి సినిమాకు కూడా ఆయన పనిచేశారు. కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా ఆయన తమిళ తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో నటించారు.

    30కి పైగా సినిమాల్లో

    30కి పైగా సినిమాల్లో

    సుమారు 30కి పైగా సినిమాల్లో శివ శంకర్ మాస్టర్ నటించగా అందులో సుడిగాడు, నేనే రాజు నేనే మంత్రి, రాజుగారి గది త్రీ, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాలు గుర్తుంచుకోదగ్గవి. బుల్లితెర మీద కూడా తనదైన ముద్ర వేసుకున్నారు శివ శంకర్ మాస్టర్ అనేక డాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ఆయన సీరియల్స్ లో కూడా నటుడిగా మెప్పించారు. తెలుగులో నెంబర్ వన్ కోడలు తమిళ్ లో జ్యోతి అనే సీరియల్ లో కూడా ఆయన నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళనాడులో ఒక హోల్సేల్ పండిన పండ్ల వ్యాపారి కుటుంబంలో జన్మించిన శివ శంకర్ మాస్టర్ చిన్నతనంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొని స్కూల్ కి కూడా వెళ్ళేవారు కాదు దీంతో ఆయన చదువంతా ఇంట్లోనే సాగింది.

    అండగా టాలీవుడ్

    అండగా టాలీవుడ్

    అయితే ఇంత చరిత్ర ఉన్న శివ శంకర్ మాస్టర్ చివరి రోజుల్లో అనారోగ్య సమస్యలకు హాస్పిటల్ కి కూడా ఖర్చు పెట్టలేని విధంగా ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కొంత అండగా నిలబడి ఉందని చెప్పవచ్చు. చిరంజీవి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయగా మంచు విష్ణు కూడా తాను డాక్టర్లతో నిరంతరం టచ్లోనే ఉన్నానని గతంలో ప్రకటించారు. ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూయడంతో ఇప్పుడు టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది.

    English summary
    tollywood choreographer Shiva Shankar Master Passes Away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X