twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దబాంగ్ 3లో అలీ.. కానిస్టేబుల్ పాత్రలో!

    |

    స్టార్ కమెడియన్ అలీ ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా తనదైన శైలిలో కామెడీ పంచులు పేల్చుతూ హాస్యాన్ని పండిస్తాడు. అలీ కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా అలీ ప్రస్తుతం ఓ క్రేజీ అవకాశాన్ని దక్కించుకున్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సిరీస్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సల్మాన్ దబాంగ్ 3కి సిద్ధం అవుతున్నాడు.

    ప్రభుదేవా దర్వకత్వంలో దబాంగ్ 3 తెరకెక్కుతోంది. ఇటీవల షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పోలిసు ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కమెడియన్ అలీ ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. దబాంగ్ 3 సెట్స్ లో అలీ తన కుటుంబంతో కలసి సల్మాన్ ఖాన్ తో ఫోటో దిగాడు.

    Tollywood comedian Ali playing important role in Salman Khans Dabangg 3

    దబాంగ్ 3లో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. దబాంగ్ మొదటి రెండు భాగాల తరహాలోనే ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Tollywood comedian Ali playing important role in Salman Khan's Dabangg 3
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X