ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా?.... బండ్ల గణేష్‌పై పృథ్వీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల అనంతరం కమెడియన్ పృథ్వీ ఈ విషయమై స్పందించారు.
తెలంగాణలో రిజల్ట్ వచ్చే రోజున కొన్ని టీవీ ఛానల్స్ వారు బ్లేడు ప్యాకెట్, పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వెళ్లారు... ఉత్తమ్ కుమార్ ఇంట్లో కూర్చున్న బండ్ల గణేష్ ఎంతకూ బయటకు రాలేదు. ఆయన అలాంటి వ్మాఖ్యలు చేయడం కామెడీ అయిపోయిందని పృథ్వీ అన్నారు.

ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా?
ఇపుడు టీఆర్ఎస్ ఐదేళ్లు పాలిస్తుంది. నువ్వు ఎక్కడికైనా ఫ్యామిలీ గుడికి వెళితే... నిన్ను చూసి ఈడేరా ఆ బఫూన్‌గాడు, బ్లేడ్ బాబ్జీ అంటారా? అనరా? ఉత్తరకుమారుడి ప్రగర్భాల్లాగా బండ్ల గణేష్ చేశాడు. సీటు రాకముందు ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. చివరకు దారుణంగా ఓడిపోయారని పృథ్వీ వ్యాఖ్యానించారు.

రాజకీయ అనుభవం లేదు, కోళ్ల పారం అనుభవం మాత్రమే ఉంది
బండ్ల గణేష్‌కు రాజకీయ అనుభం లేదు... ఆయనకు అనుభవం ఉంది కోళ్ల ఫారం వ్యాపారంలో మాత్రమే. సినిమా బిజినెస్ కూడా బాగా చేస్తారు... వంద మాటలు అమ్ముతాడు వంద మాటలు కొంటాడు. కానీ రాజకీయాలు అలా కాదు.

ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి వచ్చి...
కేసీఆర్ గురించి ఏం తెలుసని మాట్లాడారు? ఆయన(బండ్ల గణేష్) తెలంగాణా? కాదుకదా... ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యక్తి. కేసీఆర్, కేటీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.

మాకు ఎలాగూ వేషాలు ఇవ్వడు
ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినపుడే... పోలీసులకు టీవీ ముఖంగా చెప్పాను. ఒక పౌరుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. అలా మాట్లాడే వారిని మా వైపు తింగరోడు అంటారు. తింగరగా మాట్లాడినా అతడొక ప్రొడ్యూసర్... ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి మాకు ఎలాగూ వేషాలు ఇవ్వడు. 24 క్రాఫ్ట్స్ కార్మికులకు అయినా పని దొరుకుతుంది. టీవీ ఛాన్సల్స్ వారు ఆ బ్లేడు ఉత్తమ్ కుమార్‌కు ఇస్తే గడ్డం గీసుకుంటాడు... అని పృథ్వీ వ్యాఖ్యానించారు.

తిరుపతిలో బండ్ల గణేష్ రియాక్షన్
కాగా.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి వచ్చిన బండ్ల గణేష్ మీడియాకు ఎదురయ్యారు. మీ పార్టీ ఓడిపోతే బ్లేడుతో గొంతుసుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు కదా... అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘వంద అంటాం సార్, చాలా మంది చాలా అంటారు. అవన్నీ జరుగుతాయా? లేదు మీరు కోసుకొమ్మంటే కోసుకుంటా...అంటూ ప్రశ్నలతో విరుచుకుపడిన మీడియా వారిపై అసహనం వ్యక్తం చేశారు బండ్ల గణేష్. ఎన్నికల ముందు మా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే అలా అన్నాను. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఇపుడు నన్నేం చేయమంటారు?..... అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











