For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టిన అదుర్స్ మూవీ కమెడియన్.. టెండర్స్ వేయడంతో జాక్ పాట్!

  |

  సినిమా ప్రపంచంలో జీవితం అనేది చాలా వైవిధ్యంగా కొనసాగుతుంది. వెండితెరపై ఎంత కలర్ఫుల్ గా కనిపించినప్పటికీ కూడా వెండి తెర వెనుక మాత్రం కొంతమంది సినీ నటుల జీవితాలు చాలా సాధారణంగా ఉంటాయి. అయితే స్టార్ హోదా ఉన్నన్ని రోజులు కూడా వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అది శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అవుతూ ఉంటుంది. అందుకే చాలామంది నటీనటులు సినీ ప్రముఖులు కూడా వీలైనంత వరకు సేఫ్ జోన్ లో ఉండేందుకు కొన్ని వ్యాపారాలను కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక అదుర్స్ సినిమాతో బాగా పాపులర్ అయిన కమెడియన్ రఘు ఇటీవల లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టాడు.

  సేఫ్ జోన్ లో..

  సేఫ్ జోన్ లో..

  సినిమా ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు అనేది దాదాపు అందరూ నటీనటులకు తెలుసు. అయితే కొందరు మాత్రం ఆ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. మరి కొందరు నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకుంటూ ఉంటారు. ఎన్నో కోట్ల ఆస్తులను చూసిన వారు కూడా ఒక్కసారిగా డౌన్ అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి అందుకే వీలైనంత వరకు సేఫ్ జోన్ లో ఉండేందుకు నాలుగురాళ్లు వెనక్కివేసుకుంటూ ఉంటారు.

  సొంత ఇల్లు..

  సొంత ఇల్లు..

  దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత గురించి సినిమా ఇండస్ట్రీ లో చాలామందికి తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్టార్ హోదా ఉన్న సమయంలోనే మంచి అవకాశాలు అందుకుంటూ వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని దాచుకుంటారు. ఆ విషయంలో కొందరు చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. వారి కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా కట్టుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీయన్స్ దాదాపు అందరు కూడా సొంత ఇంటి కలను నిజం చేసుకున్నారు.

  లాక్ డౌన్ లో వేసిన ప్లాన్

  లాక్ డౌన్ లో వేసిన ప్లాన్

  ఇక రీసెంట్ గా కమెడియన్ అదుర్స్ మూవీ రఘు కూడా లిక్కర్ బిజినెస్ తో తన సరికొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. రఘు 2002 నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయనకి సినిమా అవకాశాలు చాలా తగ్గుతూ వచ్చాయి. ఇక అతను లాక్ డౌన్ లో వేసిన ఒక ప్రణాళిక బాగా వర్కౌట్ అవ్వడంతో ఆ వచ్చిన ఆదాయంతో లిక్కర్ బిజినెస్ మొదలు పెట్టాడు.

  ఖాళీగా ఉండకుండా

  ఖాళీగా ఉండకుండా

  కమెడియన్ రఘు లాక్ డౌన్ లో ఖాళీగా ఉండకుండా తన ఇంటి పరిసరాలలో కొన్ని ఆర్గానిక్ మొక్కలను నాటడట. వాటి తో వచ్చిన కూరగాయలను అతనికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఆ నమ్మకంతోనే పది ఎకరాల పొలం లీజుకు తీసుకొని భారీ స్థాయిలో కూరగాయలు పండించడట. బిజినెస్ తో తెలివిగా వాటి ద్వారా మంచి ఆదాయాన్ని అందుకున్నారట. ఆ తర్వాత మరొక మంచి నిర్ణయం తీసుకున్నాడు.

  టెండర్స్ లో జాక్ పాట్

  టెండర్స్ లో జాక్ పాట్


  తెలంగాణ ప్రభుత్వం రీసెంట్ గా నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో రఘుతో పాటు అతని ముగ్గురు స్నేహితులు టెండర్స్ వేశారు. ఇక అందులో రెండు టెండర్స్ కూడా రఘు పేరు మీద వచ్చాయి. నల్లగొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద అభినవ్ పేరుపై 1 & 2 దుకాణాలను రఘు దక్కించుకున్నాడు. ఇక ఇటీవల అతను తన మద్యం షాపులను స్టార్ట్ చేశాడు.

  ఆ సినిమాలతో మంచి క్రేజ్

  ఆ సినిమాలతో మంచి క్రేజ్


  కమెడియన్ రఘు 2002 లో ఆది సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఎక్కువగా విలన్ కమెడియన్ రోల్స్ లో తను మంచి గుర్తింపు అందుకున్నాడు. వి.వి.వినాయక్, సురేందర్ రెడ్డి వంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా పనిచేశాడు. అదుర్స్ సినిమాలో కూడా అతను చేసిన కామెడీ కి మంచి పేరు దక్కింది. ఆ తర్వాత రేసుగుర్రంలో కనిపించింది కొద్దిసేపే అయినప్పటికీ రఘు మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

  Recommended Video

  Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
  సరికొత్త జీవితం

  సరికొత్త జీవితం

  ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు బుల్లితెరపై కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ మధ్యలో జబర్దస్త్ లో కూడా రోలర్ రఘు పేరుతో టీమ్ లో కెప్టెన్ గా కొనసాగాడు. అంతే కాకుండా ఆ మధ్యలో అలీతో సరదాగా షోలో కూడా బిజీగా కనిపించాడు. మొత్తంగా కమెడియన్ రఘు సినిమాలు తగ్గించి లిక్కర్ బిజినెస్ లతో సరి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. మరి ఈ రూట్లో అతను ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

  English summary
  Tollywood Comedian raghu new liquor bussiness in telanagana,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X