twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాతో చాలా డబ్బులు పోయాయి.. అవకాశాలు కూడా తగ్గాయి: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఆవేదన

    |

    కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి. గత 20 ఏళ్ళ నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఈ సీనియర్ మోస్ట్ కమెడియన్ స్టార్ కమెడియన్ గా బిజీ అవ్వడానికి చాలా సమయమే పట్టింది. ఇక ఆ మధ్య హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ కాలేకపోయాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో నష్టపోయిన సినిమా గురించి వివరణ ఇచ్చారు.

    మన మంచి కోసమే..

    మన మంచి కోసమే..

    లాక్ డౌన్ గురించి ముందుగానే ఉహించాను. ముందుగా అనుకున్న దానికంటే మరికొన్ని రోజులు సమయం పడుతుందని అనుకున్నా. ప్రాణాలు కాపాడుకోవాలంటే తప్పదు. ఏదైనా మన మంచి కోసమే. రోజు ఖాళీగా ఉండకుండా నా భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ రెండేళ్ల మా పాపను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మరణాల వార్తలు వినడం ఇష్టం లేక టివి చూడటం కూడా మనేశాను.

    ఆ సినిమాతో చాలా నష్టపోయా..

    ఆ సినిమాతో చాలా నష్టపోయా..

    భాగ్యనగర విధుల్లో గమ్మత్తు అనే సినిమా కథను రాసుకునపుడు స్క్రిప్ట్ నచ్చడంతో నేనే ఈ సినిమాను సొంత ప్రొడక్షన్ లో డైరెక్ట్ చేసి రూపొందించాలని అనుకున్నా. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. పైగా ఇండస్ట్రీలో చెడ్డపేరు తెచ్చిపెట్టింది. సినిమా ప్లాప్ కావడంతో నిరాశచెందాను. సినిమా ఆడకపోయినప్పటికి దర్శకుడిగా కొత్తగా ట్రై చేశాను అని కొందరు ప్రశంసించారు.

     అందుకే అవకాశాలు తగ్గాయి..

    అందుకే అవకాశాలు తగ్గాయి..

    హీరోగా కొన్ని సినిమాలు చేశాక కొందరు దర్శకులు నేను పూర్తి హీరోగా మరాను అనుకోని కామెడీ రోల్స్ చేయనేమో అని అపార్థం చేసుకున్నారు. కానీ నేను మాత్రం కామెడీ రోల్స్ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమే.. ఇక బుల్లితెరపై కూడా మరొకసారి నటించాలని ఉంది. అవకాశం వస్తే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా మంచి పాత్రలను చేయాలని ఉంది.

    Recommended Video

    Anchor Rashmi Gautam Feeding Road Dogs During Lockdown!
    20ఏళ్ళ జర్నీ..

    20ఏళ్ళ జర్నీ..

    ఒక్కసారి ఆలోచిస్తే అప్పుడే 20 ఏళ్ళు గడిచాయ అని అనిపిస్తోంది. నా సినిమా కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. పలు గుణపాఠాలను గుర్తుపెట్టుకొని ముందుకు సాగుతున్నా. భవిష్యత్తులో మళ్ళీ డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. ప్రస్తుతానికి కొన్ని సినిమాల్లో నటిస్తున్నా.. అలాగే వచ్చిన అవకాశాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తక్షణ కర్తవ్యం అంటూ శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు.

    English summary
    super talented, and senior comedian Srinivasa Reddy. In a detailed conversation, in interview srinivas talks about his future plans, his failure as a director, production, take on new-age cinema and much more. Here is the transcript.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X