»   » పిల్లనగ్రోవి ‘కృష్ణుడు’ కిషోర్‌తో ఆర్టిస్టు శ్రీనివాసరెడ్డి.. ఏమిటా ఫొటో వెనుక కథ.

పిల్లనగ్రోవి ‘కృష్ణుడు’ కిషోర్‌తో ఆర్టిస్టు శ్రీనివాసరెడ్డి.. ఏమిటా ఫొటో వెనుక కథ.

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో కమెడియన్లుగా తమదైన ముద్ర వేసుకొన్న వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి హీరోలుగాను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా హాస్య నటులుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయంబురా చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిభావంతులైన ఆ ఇద్దరు కలిస్తే సెట్లో అల్లరి, చిలిపి చేష్టలకు అంతే ఉండదనేది ఫిలిం సర్కిళ్లలో టాక్.

Tollywood comedian srinivasreddy shares a photo with Vennela Kishore

ఇటీవల ఓ షూటింగ్ గ్యాప్‌లో సరదాగా వెన్నెల కిషోర్ ఫ్లూటు వాయిస్తుంటే.. పక్కనే ఉన్న శ్రీనివాసరెడ్డి కొంత బాధ, కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ క్షణాలను సెల్ఫీగా బంధించి ఫ్లూటిస్ట్ కిషోర్‌తో ఆర్టిస్టు శ్రీనివాసరెడ్డి అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో.. ఆ ఫొటో వెనుక కథేంటో చెపితే వారి అభిమానులు మరింత ఆనందపడి ఉండేవారు కదా.

English summary
Tollywood comedians Srinivas Reddy, Vennela Kishore posed for a selfie. Srinivas Reddy shared a photo in Twitter saying that Artist Srinivas Reddy with Flutist Kishore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu