'స్కామ్'...సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మిపై తీవ్ర ఆరోపణలు
"ఆమెకు తెలుగు తెలీదు. తెలుగు చదవడం రాదు. ఏది బూతో, ఏది నీతో తెలీదు. తొమ్మిది కోట్లమంది తెలుగువాళ్లుండగా ఆమె సెన్సార్ ఆఫీసర్ అయ్యిందంటే తెలుగువాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. సెన్సార్ నుంచి బయటకొచ్చిన సినిమాల విషయంలో ఆమెను నిలదీయకుండా థియేటర్ల మీదా, నిర్మాతల మీదా పడటం ఎంతవరకు సబబు?'' అని దర్శకుడు తేజ ఆవేశంగా ప్రశ్నించారు. ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమానికి హాజరైన తేజ తన ఆవేదనను ఇలా వెళ్లగక్కారు. మరో ప్రముఖ నిర్మాత నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ...ఆమె ట్రాన్సఫర్ ని ఇక్కడి పెద్ద నిర్మాత ఆపు చేసారని అన్నారు. ఆ నిర్మాత ఎవరో చెప్పాలని తేజ డిమాండ్ చేసారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. "నలుగురిలో ఒక్క సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ సినిమా బయటకు రాదు. కానీ ఇవాళ సెన్సార్ బోర్డులో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అది పునరావాస కేంద్రంగా మారింది'' అని భరద్వాజ అంటే, ధనలక్ష్మికి కొమ్ము కాసే సభ్యులకే సినిమాలు చూ సే అవకాశం ఇస్తున్నారని సెన్సార్ సభ్యుడు కె. విద్యాసాగర్ ఆరోపించారు.ఆమెను మార్చాలని కోరుతూ కేంద్రానికి లెటర్ పంపామని, త్వరలోనే ఆమె మారుతారని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు.
తెలుగు భాష మీద సెన్సార్ ఆఫీసర్‌కు అవగాహన లేని మాట నిజమేనని సెన్సార్ సభ్యురాలిగా పనిచేసిన స్వాతి సోమనాథ్ చెప్పారు. "దేశభాషలందు తెలు గు లెస్స సంగతేమో కానీ, 'దేశ జాతులందు తెలుగు లెస్' అనాలి. సినిమావాళ్లు వ్యాపా రం చేసుకోండి. అదే సమయంలో సామాజిక బాధ్యత గురించి కూడా ఆలోచించండి'' అని ఆమె పేర్కొన్నారు. "సినిమాల విషయంలో సెన్సార్ ఆఫీసర్‌ను తప్పు పట్టడమెందుకు? మనకు తెలుగు వచ్చు కదా. సమాజాన్ని అర్థం చేసుకుని మనమే సినిమాలు తీయొచ్చు. బ్రాహ్మణ వర్గమంతా ఇలాగే ఉంటుందనేలా చిత్రించడం కరెక్ట్ కాదు. దర్శకులు, రచయితలకు అవగాహన సదస్సులు పెట్టాలి'' అని 'కొమరం భీమ్' దర్శకుడు అల్లాణి శ్రీధర్ సూచించారు.


Click it and Unblock the Notifications












