రాజీపడని వ్యక్తి: బాలకృష్ణ

ఇక మరో నటుడు,ప్రజా రాజ్యం అధినేత చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..త్రివిక్రమరావుగారు నాతో మూడు చిత్రాలు నిర్మించారు. స్నేహశీలి. గర్వించదగ్గ నిర్మాత. చిత్రనిర్మాణ రంగంలో రాజీపడని నైజం ఆయనని అగ్రనిర్మాతగా నిలబెట్టింది. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు. మెగా ప్రొడ్యూసర్ రామానాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన నిర్మాతగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి త్రివిక్రమరావుగారు అన్నారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...ఆయన నాతో రెండు సినిమాలు తీశారు. నిర్మాత, దర్శకుడు అనేదాని కంటే మా ఇద్దరి మధ్య మంచిస్నేహబంధం ఉంది. కుటుంబమిత్రుడయిన త్రివిక్రమరావు మరణం నన్నెంతో బాధించింది అంటూ స్పందించారు. ఇలా టాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడాలేకుండా ఆయనకు నివాళులు అర్పించారు.


Click it and Unblock the Notifications











