twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ కల్చర్‌తో టాలీవుడ్ కళకళ!

    By Bojja Kumar
    |

    కాపీ కథల కల్చర్ తో ప్రస్తుతం టాలీవుడ్ కళకళలాడుతుంది. కాపీ కథలయినా సూపర్ డూపర్ హిట్లుగా దూసుకెలుతున్నాయి. అయితే ఈ కాపీ వ్యవహారం ఇప్పటికాదు...ఇది కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. భారతీయ సిని పరిశ్రమలో ఓవరాల్ గా తీసుకుంటే దాదాపు 60 శాతం సినిమా కథలు ఇతర సినిమాలను కాపీ కొట్టడమో, వేరే సినిమాలోని ఓ అంశాన్ని తీసుకోవడమో, లేక ఇతర సినిమాలను ఇన్ స్పైర్ గా తీసుకుని తీయడమో జరుగుతుంది.

    ఇతర భాషా సినిమాల సంగతి పక్కన పెడితే...మన తెలుగులో ఈ పండగ సీజన్ లో విడుదలైన సినిమాల గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్టయిన సినిమా దూకుడు. ఇది జర్మన్ సినిమా గుడ్ బై లెనిన్ సినిమా ఆధారంగా రూపొందించారట. జూనియర్ ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఊసరవెల్లి చిత్రం ఓ కాంటనోస్ చిత్రం వెంజియాన్స్ నుంచి కాపీ కొట్టారట. ఇక నాని హీరోగా విడుదలైన పిల్ల జమిందార్ సినిమా సౌత్ కొరియన్ సినిమా 'ఎ మిలియనీర్ ఫస్ట్ లవ్" చిత్రం ఆధారంగా రూపొందించారు. కాపీ కొడితే కొట్టారు కానీ...ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాయి.

    English summary
    NTR Jr starrer Oosaravelli too is copied from a Cantonese film Vengeance. The recent release Pilla Zamindar is inspired from South Korean movie A Millionaire's First Love. Dookudu inspired German film Goodbye Lenin.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X