Just In
- 16 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 29 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 2 hrs ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
Don't Miss!
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- News
ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తారల క్రికెట్ మ్యాచ్-రామ్ చరణ్ స్పెషల్ (ఫోటోస్)
విజయవాడ: హుధూద్ తుఫాను బాధితులకు చేయూత అందించడంలో భాగంగా నిధుల సేకరణ కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లో ‘మేముసైతం' పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించారు. తాజాగా ఆదివారం విజయవాడలో సినీతారల టి-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికైంది.
మ్యాచ్ ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు బోండా ఉమా, శ్రీధర్ హాజరయ్యారు. హుద్‌హుద్ తుఫాను కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారికి అందరం చేయూతనందించాల్సిన అవసరం ఉందని, సినీ తారలంతా సాయమందించడానికి ముందుకు రావడం అభినందనీయం, ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ల కాలం నుంచి రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా సహాయం చేసేందుకు ముందు ఉంటోందని, ఇది ఎంతో హర్షణీయమని వక్తలు పేర్కొన్నారు.
స్పెషల్ గెస్టుగా హాజరైన రామ్‌చరణ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిపిన ‘మేము సైతం' క్రికెట్ మ్యాచ్‌లో భారీగా విరాళాలు వచ్చాయని, ఇపుడు మ్యాచ్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. గెలుపోటములను సరదాగా తీసుకోవాలని సూచించారు.
మ్యాచ్ విషయానికొస్తే...
శ్రీకాంత్ ఎలెవన్ జట్టు తరుణ్ ఎలెవన్ జట్టుపై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టార్ క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చిన రూ.20 లక్షలను సీఎం సహాయనిధికి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు ఫ్యూచరాల్ సంస్థ తరుపున సంస్థ ఎండి రవి, శ్రీమిత్రా సంస్థ తరుపున ఎం.వి.చౌదరి పది లక్షలు చొప్పున, అభినందన సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే దమ్మాలపాటి శ్రీధర్, భాష్యం విద్యాసంస్థలు, పీజే ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐదు లక్షలు చొప్పున అందజేశారు.
స్లైడ్ షోలోఫోటోలు....

టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్
ఆదివారం విజయవాడలో సినీతారల టి-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికైంది.

హుధూద్ బాధితుల కోసం
హుధూద్ తుఫాను బాధితులకు చేయూత అందించడంలో భాగంగా నిధుల సేకరణ కోసం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్స్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈకార్యక్రమానికి స్పెషల్ గెస్టుగా హాజరయ్యారు.

మ్యాచ్ విన్నర్
శ్రీకాంత్ ఎలెవన్ జట్టు తరుణ్ ఎలెవన్ జట్టుపై 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.

రూ. 20 లక్షలు
స్టార్ క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చిన రూ.20 లక్షలను సీఎం సహాయనిధికి అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

మరో 35 లక్షలు
మ్యాచ్ సందర్భంగా వివిధ ప్రైవేట్ సంస్థలు రూ. 35 లక్షల వరకు విరాళాలు అందించారు.

అభినందనీయం
సినీ తారలు విపత్తు బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడంపై పలువురు అభినందించారు.

సాయి ధరమ్ తేజ్
క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్న మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్.

అల్లరి నరేష్
మ్యాచ్ సందర్భంగా క్యాచ్ పట్టిన ఆనందంలో అల్లరి నరేష్.

ప్రిన్స్
యంగ్ హీరో ప్రిన్స్ తన పెర్ఫార్మెన్సుతో ఆకట్టుకున్నారు.

ట్రోపీ
మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముందు ట్రోపీని ఆవిష్కరిస్తున్న స్టార్స్.

చెక్కు...
మ్యాచ్ నిర్వహణ ద్వారా సమకూరిన రూ. 20 లక్షల చెక్కను అందిస్తున్న స్టార్స్.

జగపతి బాబు
ఈ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటుడు జగపతి బాబు కూడా పాల్గొన్నారు.

తరుణ్
బౌలింగ్ వేస్తున్న జట్టు కెప్టెన్ తరుణ్.

ఆడియో రిలీజ్
ఈ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఢీ అంటే ఢీ ఆడియో రిలీజ్ చేసారు.

డాక్టర్ సలీమ్
డాక్టర్ సలీమ్ మూవీ ఆడియో ఆవిష్కరణ కూడా ఇదే వేదికపై జరిగింది.