టాలీవుడ్ క్రికెట్ టీమ్ చిరు - బాలయ్య - నాగ్ - వెంకీ!
ఇటీవల ముగిసిన ఐపియల్ జట్లకు పేర్లు ఉన్నట్లే..జూన్ 13న టాలీవుడ్ తారలు ఆడే టాలీవుడ్ టి20 క్రికెట్ టోర్ని కు కూడా నాలుగు జట్లు ఉంటాయని..ఐపియల్ కి ఏ రేంజ్ లో తగ్గకుండా 'మా" మ్యాచ్ లుంటాయని..గత కొన్ని రోజుల క్రితం ఈ టోర్నికి అధ్యక్ష పదవి వహిస్తున్న నటసింహాం బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే నలుగురు స్టార్ హీరోలు నాలుగు టీమ్ లుగా విభజించబడినవి. చిరు బాలయ్య, నాగ్, వెంకీలు కెప్టెన్లుగా నాలుగు జట్లు ఉంటున్న ఈ టోర్నికి ఐపీయల్ లానే టీమ్ పేర్లు, లోగోలు కూడా ఉన్నాయి. చిరు టీమ్ పేరు చిరు చీతాస్, బాలయ్య టీమ్ పేరు బాలయ్య లైన్స్, నాగ్ టీమ్ పేరు నాగ్ కింగ్స్, వెంకీ టీమ్ పేరు వెంకీ వారియర్స్ అని ఖరారు చేశారు. ఈ మాచ్ మాక్స్ చానెల్ లో టెలికాస్ట్ అవుతుందని సమాచారం.
రిథమ్ మీడియా మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్ని ద్వారా వచ్చిన మొత్తాన్ని 'మా" కి సొంత బిల్డింగ్ తో పాటు..పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందించనున్నారు..ఈ మ్యాచ్ లలో ఆడుతున్న హీరోలందరూ ఇప్పటికే ప్రాక్టీస్ లో నిమగ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications











