బాలకృష్ణ, చిరంజీవి మద్య హోరాహోరి మొదలైంది!

By Sindhu

గత మంగళవారం సాయంత్రం హైదరాబాదు శివారు ప్రాంతంలో గల లహరి రీసార్ట్స్ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి జట్ల మద్య ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. జూన్ 13న నిర్వహించ తలపెట్టిన టాలీవుడ్ టి20 మ్యాచ్ కోసం బాలయ్య లయన్స్, చిరు చీతాస్, వెంకీ వారియర్స్, నాగ్ కింగ్స్ గా నాలుగు జట్లు ఏర్సడ్డ విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ తారలు క్రమం తప్పకుండా గెలుపు కోసం ఆరాటాన్ని కనబరుస్తూ బ్యాట్లు, బంతులు పట్టుకుని గ్రౌండ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో బాగంగానే నిన్న సాయంత్రం బాలయ్య లయన్స్, చిరు చీతాస్ జట్ల మద్యన ఒక ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. చిరంజీవి మినహాయిస్తే దాదాపు ఇరు జట్లలోని సభ్యలందరూ ఈ మ్యాచ్ లో ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.

టాలీవుడ్ ప్రముఖ హీరోలు బాలకృష్ణ, రామ్చరణ్, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, సిద్దార్ధ్, నితిన్, అల్లరి నరేష్,వరుణ్ సందేశ్ తదితర తారాగాణంతో మ్యాచ్ జరిగే ప్రాంగణం అంతా తారల తళుకులతో కళ కళ లాడింది. మొదట బ్యాటింగ్ చేసిన బాలయ్య లయన్స్ జట్టు నీర్ణీత 25 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి చిరు చీతాస్ జట్టుకి సవాల్ విసిరారు. భారీ స్కోరును క్రమంలో మొదట తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన చిరు చీతాస్ జట్టుకి బాలయ్య కట్టు దిట్టమైన బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టడంతో కలవరం ఇంకాస్త పెరిగింది. తర్వాత రఘు(రవితేజ సోదరుడు) దూకుడైన ఆటతీరుతో తేరుకుని మొత్తానికి ఏడు వికెట్లు నష్టపోయి బాలయ్య లయన్స్ విసిరిన 176 సవాలును అధిగమించారు.

మ్యాచ్ మొత్తం పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు సాగడంతో, జూన్ 13న జరగబోయే తుది సమరం జనరంజకంగా ఉంటుందనడంలో సందేహం లేదనిపిస్తోంది. మొత్తం మీద అభిమానులకు కనుల విందు ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X