»   » రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ క్రికెట్ కి ‘మా’ మ్యాచ్ ఫిక్సింగా!?

రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ క్రికెట్ కి ‘మా’ మ్యాచ్ ఫిక్సింగా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సారి జరగబోయే టాలీవుడ్ టీ20కి ఓ ప్రత్యేక క్రేజ్ ఏర్పడటంతో పాటు టిక్కెట్లు కూడా భారీ స్థాయిలో అమ్ముడు పోతున్నాయట. అయితే ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎంతమంది స్టార్లు ఉన్నా ఓ ఇద్దరి స్టార్ల వల్లే ఈ టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ కి అత్యంత ఆదరణ లభిస్తుందని వార్తలు వస్తున్నాయి. జట్టు కెప్టెన్లుగా చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు ఉన్నా..వీరెవరికి రాని క్రేజ్ ఆ ఇద్దరి స్టార్లకు రావడం విశేషం..ఇంతకీ ఆ ఇద్దరు స్టార్లు ఎవరనుకున్నారు?

మగధీర రామ్ చరణ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ వీరిద్దరే ఈసారి మ్యాచ్ కి హైలెట్ కానున్నారు. దీనికి కారణం..నలుగురు కెప్టెన్లకి మిగతా ఆటగాళ్లని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారన్న విషయం తెలిసిందే..అయితే ఈ లక్కీ డ్రాలో చిరు జట్టులోనికి యంగ్ టైగర్ బాలయ్య జట్టులోనికి రామ్ చరణ్ వస్తారని అందరూ తెగ ఊమించేసుకుంటున్నారు. ఇదే విధంగా జరగడానికి 'మా" మ్యాచ్ ఫిక్సింగ్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎందుకంటే వారిద్దరూ అలా అపోజిట్ గా ఆడితేనే మ్యాచ్ కి మరింత క్రేజ్ ఏర్సడుతుందని వారికి కూడా తెలుసు కాబట్టి ఇదే జరిగితే స్టేడియంలో కూర్చొన్న ప్రేక్షకుడితో పాటు టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు..ఎంతో ఆనందాన్ని పొందడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.. మరి ఒకవేళ అలానే ఎంపికైతే వీరిద్దరు ఎటువంటి ఓన్ ఫీలింగ్స్, వ్యతిరేకతలు ప్రదర్శించకుండా తమ జట్టు గెలుపుకోసం ఎంతగా పోరాడతారో చెప్పేది కానేకాదు. చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu