క్రికెట్ యుద్ద మహాసంగ్రామానికి చిరు, బాలయ్య, నాగ్, వెంకీ సైన్యం సిద్దం!
జూన్ 13న జరుగనున్న టాలీవుడ్ ట్రోఫి క్రికెట్ సమరానికి టీమ్స్ సెలెక్షన్ పూర్తయింది. ప్రతి టీమ్ లోనూ సమర్ధలైన ఆటగాళ్లు వుండేలా పోరు రసవత్తరంగా సాగేలా పరిశీలనాత్మక జాగ్రత్తలు తీసుకుంటూనే అభిమానులలోనూ ఆసక్తిని పెంచేలా జట్టులను తయారు చేయడం జరిగింది. ఇక క్రికెట్ యుద్దానికి సిద్దం అంటోన్న ఆ నాలుగు జట్ల సభ్యుల వివరాలేంటో ఒక సారి చూద్దామా.
చిరు చీతాస్: చిరంజీవి(కెప్టెన్), రామ్ చరణ్ తేజ్, (వైస్ కెప్టెన్), రవితేజ, అల్లు అర్జున్, రానా, శ్రీహరి, ఆకాష్, అయ్యప్పశర్మ, సచిన్, రఘు, వైభవ్, నితిన్, రాఘవేంద్ర, బ్రహ్మాజీ, శివబాలాజీ, మాదాల రవి, జీవి, వడ్డే నవీన్, సందీప్.
బాలయ్య లయన్స్: బాలకష్ణ(కెప్టెన్), జూ ఎన్టీఆర్ (వైస్ కెప్టెన్), ప్రభాస్, గోపిచంద్, రాజశేఖర్, సుశాంత్, శర్వానంద్, నవదీప్, ప్రభు, రవి సాయి, దాసరి అరుణ్, సమీర్, శశాంక్, గౌతమ్, ఆలీ, బాలదిత్య, ఓ కళ్యాణ్, కమలాకర్, భూపాల్.
నాగ్ కింగ్స్: నాగార్జున(కెప్టెన్) మంచు విష్ణు(వైస్ కెప్టెన్), సిద్దార్థ, సుమంత్, నాగచైతన్య, రామ్, నాని, వరుణ్ సందేశ్, ఉదయ్ కిరిణ్, రాజీవ్ కనకాల, రవిప్రకాష్, తారకరత్న, ఖయ్యూం, అల్లరి రవిబాబు, వేణు, రాజారవీంద్ర, పరుచూరి రవి, కష్ణుడు, పరమేష్, రాఘవ.
వెంకీ వారియర్స్: వెంకటేష్(కెప్టెన్), తరుణ్(వైస్ కెప్టెన్), మంచు మనోజ్, శ్రీకాంత్, కళ్యాణ్ రామ్, రోహిత్, ఆదర్శ, రాజా, ఆర్యన్ రాజేష్, కౌశిక్, నవీన్ రెడ్డి, నారా రోహిత్, నిఖిల్, శివాజీ రాజా, అల్లరి నరష్, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి, వెంకట్, శివాజీ, రమణ.


Click it and Unblock the Notifications











