టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రవి కుమార్ కన్నుమూత.. మృతి కారణమేంటీ?
తెలుగు చిత్ర పరిశ్రమలో తాజాగా విషాదం జరిగింది. టాలీవుడ్ హీరోలతో గుర్తుండిపోయే సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాజాగా కన్ను మూశారు. ఆయన మరెవరో కాదు బాలకృష్ణ, గోపీచంద్ తో సూపర్ చిత్రాలను డైరెక్ట్ చేసి ఏఎస్ రవికుమార్ చౌదరినే. ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గుండె పోటుతో మృతి చెందారని సన్నిహితులు తెలుపుతున్నారు. ఆయన మరణ వార్తలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికి, కుటుంబానికి దూరంగా..
ఏఎస్ రవి కుమార్ కొన్నాళ్లుగా తన ఇంటికి కుటుంబానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ పలు కారణాల వల్ల తరుచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో కొన్నాళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే కాస్తా మానసింకంగానూ ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే గుండెపోటుకు కారణమై ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా రవి కుమార్ మృతి పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో పని చేసిన వారు అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నారు.

ఏఎస్ రవి కుమార్ సినిమాలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏఎస్ రవి కుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించు కున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో గోపీచంద్ ను విలన్ నుంచి Yagnam చిత్రంతో హీరోగా మార్చారు. అప్పట్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణతో 'వీరభద్ర' అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. అలాగే మనసుతో, ఏం పిల్లా ఏం పిల్లడో, ఆటాడిస్తా, సౌక్యం, పిల్లా నువ్వు లేని జీవితం, తిరగబడరా సామీ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు.
కొన్నాళ్లుగా డిప్రెషన్ లోనే..
ఏఎస్ రవి కుమార్ తన కెరీయర్ లో పది చిత్రా లకు డైరెక్షన్ చేశారు. అయితే ఈ సినిమాల్లో ఎక్కువగా డిజాస్టర్ గానే నిలిచాయి. కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే ఏఎస్ రవికుమార్ కు మంచి ఫలితాన్ని అందించాయి. గోపీచంద్ హీరోగా 2004లో వచ్చిన Yagnam చిత్రం, అలాగే మెగా హీరో, సుప్రీమ్ సాయి ధరమ్ తేజ్ - రెజీనా నటించిన చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'తో ఏఎస్ రవి కుమార్ చౌదరికి మంచి హిట్స్ అందాయి. అయితే ఇక మిగిలిన చిత్రాలన్నీ ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా సినిమాలను డైరెక్ట్ చేస్తూనే వచ్చారు.
చివరిగా 2024లో యంగ్ హీరో రాజ్ తరుణ్ తో 'తిరగబడరా సామీ' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. డిజాస్టర్ గానే మిగిలింది. దాంతో మరింతగా రవికుమార్ ప్రెషర్ ఫీలయ్యాడని, డిప్రెషన్ లో వెళ్లాడని సినీ ప్రముఖులు అంటున్నారు. పిల్లా నువ్వులేని జీవితంతో హిట్ అందుకున్న తర్వాత 10 ఏళ్లకు తిరగబడరా సామీ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఫలించలేదు.


Click it and Unblock the Notifications











