దర్శకుడు బాపుకు సతీవియోగం
హైదరాబాద్ : లెజండరీ తెలుగు సినీ దర్శకుడు బాపుకు సతీవియోగం కలిగింది. బాపు సతీమణి భాగ్యవతి(75) అనారోగ్యంతో శనివారం కన్నుమూసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న భాగ్యవతి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
బాపుకు సతీవియోగం కలుగడం పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు. బాపుకు సన్నిహితంగా ఉండే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన్ను కలిసి ఓదార్చారు. మరికొందరు భాగ్యలక్ష్మి అంత్య క్రియలకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఇంత కాలం తనకు వెన్నంటి ఉండి....తనను ముందుకు నడిపించి, తన విజయాలకు కారణమైన జీవిత భాగస్వామిని కోల్పోవడంతో బాపు విచారంలో మునిగి పోయారు.


Click it and Unblock the Notifications












