కూతురే కొడుకై... కోడి రామకృష్ణ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు శనివారం హైదరబాద్‌లో అశృనయనాల మధ్య ముగిశాయి. ఆయనకు కుమారులు లేక పోవడంతో కూతురు దీపిక తండ్రి చితికి నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కోడి రామకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామకృష్ణకు పలువురు, సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు.

ఫిల్మ్ ఛాంబర్‌లో కొంత సేపు ఉంచిన తర్వాత రామకృష్ణ భౌతిక కాయాన్ని మహాప్రస్తానం స్మశాన వాటికకు తరలించారు. కూతురు తీపిక చేతుల మీద అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ అభిమాన దర్శకుడి కడసారి చూపుకోసం పలువురు అభిమానులు, ప్రముఖులు తరలి వచ్చారు.
'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' మూవీతో డైరెక్టర్‌గా మారిన కోడి రామకృష్ణ వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అరుంధతి, అమ్మోరు, మంగమ్మగారి మనవడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











