twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

    |

    Recommended Video

    Senior Director Kodi Ramakrishna Is No More | Filmibeat Telugu

    శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రవైట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మూడు రోజుల క్రితమే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆయన్ను వెంటిలెటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు.

    'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' మూవీతో డైరెక్టర్‌గా మారిన కోడి రామకృష్ణ వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అరుంధతి, అమ్మోరు, మంగమ్మగారి మనవడు లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

    కోడి రామకృష్ణ

    కోడి రామకృష్ణ

    కోడి రామకృష్ణ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు. చిన్నతనం నుంచి నాటకాలంటే ఆసక్తి. దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా దర్శకు అవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు తొలి అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి సినిమానే తొలిచిత్రంగా తీద్దామనుకున్నా అది వీలుపడక ఇంట్లో రామయ్యతో దర్శకుడయ్యారు.

    ఆ ఇద్దరి తర్వాత ఈయనే

    ఆ ఇద్దరి తర్వాత ఈయనే

    తన కెరీర్లో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దాసరి నారాయణరావు, కె.ఎస్.ఆర్ దాసు తర్వాత తెలుగులో వందకుపైగా తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రమే.

    చిరంజీవి, బాలయ్యతో

    చిరంజీవి, బాలయ్యతో

    చిరంజీవితో ‘ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య' తర్వాత.. ఆయనతో సింహపురిసింహం. గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు చేశారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం "మంగమ్మగారి మనవడు"కు రామకృష్ణ దర్శకత్వం వహించారు. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు.

    అరుంధతితో భారీ విజయం

    అరుంధతితో భారీ విజయం

    అమ్మోరు, దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి లాంటి గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే చిత్రాలు తీసి అప్పట్లో కోడి రామకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి' భారీ విజయం సాధించింది.

    నటుడిగా కూడా..

    నటుడిగా కూడా..

    రామకృష్ణకు చిన్నతనం నుంచి నటుడు అవ్వాలని కోరిక. తాత మనవడు సినిమా చూశాకా, దాసరి నారాయణరావులా దర్శకుడిగా మారారు. దాసరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. దర్శకునిగా పాపులర్ అయ్యాక తొలిసారిగా 'మా ఇంటికి రండి' అనే చిత్రంలో హీరోగా నటించారు. సుహాసిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందలేదు.

    English summary
    Senior director Kodi Ramakrishna passed away. Ramakrishna was hospitalized after he had a severe breathing trouble three days ago. Kodi Ramakrishna was put on ventilator yesterday morning after he didn’t respond to the treatment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X