twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్... సంపాదనలో టాప్ డైరెక్టర్లను మించిపోయిన కొరటాల శివ!

    |

    Recommended Video

    Is Koratala Siva The Highest Earning Director In Tollywood ?

    టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ సంపాదనలో ఇండియలోని టాప్ డైరెక్టర్లందరినీ మించిపోయాడు. ఇది మేము చెబుతున్న మాట కాదు... ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ బుధవారం విడుదల చేసిన జాబితా ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2018 సంవత్సరంలో ఇండియాలో అధిక మొత్తంలో సంపాదించిన టాప్ 100 లిస్టులో కొరటాలకు చోటు దక్కింది.

    స్పోర్ట్స్, సినిమా, టెలివిజన్, మ్యూజిక్, లిటరేచర్ రంగాలకు చెందిన 100 మంది సెలబ్రిటీలతో ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న 7గురు దర్శకులకు చోటు దక్కగా... వారిలో రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ డైరెక్టర్లను సైతం వెనక్కి నెట్టి సంపాదనలో నెం.1గా నిలిచారు కొరటాల.

    కొరటాల శివ సంపాదన ఎంత అంటే?

    కొరటాల శివ సంపాదన ఎంత అంటే?

    ఫోర్బ్స్ జాబితా వివరాల ప్రకారరం కొరటాల శివ రూ. 20 కోట్లు సంపాదించారు. ఈ ఏడాది శివ దర్శకత్వం వహించిన ‘భరత్ అనే నేను' విడుదలై బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే.

    ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న డైరెక్లర్లు వీరే

    ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న డైరెక్లర్లు వీరే

    కొరటాల శివ రూ. 20 కోట్లు (39వ స్థానం)

    రాజ్ కుమార్ హిరానీ రూ. 18.33 కోట్లు (47వ స్థానం)
    సంజయ్ లీలా భన్సాలీ రూ. 18.33 కోట్లు (47వ స్థానం)
    రెమో డిసౌజా రూ. 15.50 కోట్లు (65వ స్థానం)
    రోహిత్ శెట్టి రూ. 12 కోట్లు (79వ స్థానం)
    హరి రూ. 12 కోట్లు (79వ స్థానం)
    ఆర్ బాల్కి 8 కోట్లు (93వ స్థానం)

    ఫోర్బ్స్ 2018: సంపాదనలో పవన్ టాప్, మహేష్‌ను మించిన ఎన్టీఆర్, చెర్రీతో సమంగా విజయ్ దేవరకొండ!ఫోర్బ్స్ 2018: సంపాదనలో పవన్ టాప్, మహేష్‌ను మించిన ఎన్టీఆర్, చెర్రీతో సమంగా విజయ్ దేవరకొండ!

    రాజ్ కుమార్ హిరానీ

    రాజ్ కుమార్ హిరానీ

    రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంజు' చిత్రం ఈ ఏడాది జూన్లో విడుదలై బాక్సాఫీసు వద్ద రూ. 586.85 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయినప్పటికీ అతడి సంపాదన కొరటాల కంటే తక్కువగా రూ. 18.33 కోట్లు మాత్రమే ఉండటం ఆశ్చర్యమే.

    సంజయ్ లీలా భన్సాలీ

    సంజయ్ లీలా భన్సాలీ

    ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలీ భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్' చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 585 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రానికి భన్సాలీ నిర్మాతగా కూడా వ్యవహరించారు.

    వాళ్ల పేర్లు రాలేదేంటి?

    వాళ్ల పేర్లు రాలేదేంటి?

    అయితే ఫోర్బ్స్ 2018 జాబితాలో 2.0 దర్శకుడు శంకర్ పేపరు లేక పోవడం ఆశ్చర్యమే మరి. ఎవరి సంగతి ఎలా ఉన్నా... కొరటాల శివ నెం.1 స్థానం దక్కించుకోవడంపై టాలీవుడ్ అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

    English summary
    Tollywood director Koratala Siva has emerged as the highest earning director to be featured in 2018's Forbes India Celebrity 100 list with 20 cr Earnings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X