కోహ్లీ నిన్ను తల్లిని మాత్రమే చేశాడు,మహారాణిని చేయలేదు..ఆ కామెంట్స్ పై తెలుగు డైరెక్టర్ ఫైర్

సోషల్ మిడియా ప్రపంచంలో పాజిటివ్ కామెంట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తాయని అందరికి తెలిసిన విషయమే. విషయం ఏదైనా సరే విమర్శలు కామన్. ఇక ఇటీవల అనుష్క శర్మ ప్రెగ్నెంట్ పై కూడా ఎవరు ఊహించని కామెంట్స్ రావడం అందరిని ఆశ్చర్యనికి గురి చేశాయి. ఇక ఆ విమర్శలకు తెలుగు దర్శకుడు మారుతి ఫైర్ అయ్యాడు. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 ఆ గుడ్ న్యూస్ చెప్పగానే..

ఆ గుడ్ న్యూస్ చెప్పగానే..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఏ స్థాయిలో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఈ కపుల్స్ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పి అందరిని ఆకర్షించారు. ఇక ఆ ఆనందాన్ని ఈ కపుల్స్ రెగ్యులర్ గా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

 ఇంతకంటే ఆనందం ఉంటుందా?

ఇంతకంటే ఆనందం ఉంటుందా?

ఇక ఒక లేడి జర్నలిస్ట్ సోషల్ మిడియాలోనే అనుష్క ప్రెగ్నెన్సీ పై సెటైర్ వేయడం విమర్శలకు దారి తీసింది. ముందుగా అనుష్క తన బేబి బంప్ ను చూపిస్తూ ఇంతకంటే ఆనందం, అదృష్టం మరొకటి ఉండదు అని ఎమోషనల్ గా కామెంట్ చెయగా విరాట్ కోహ్లీ కూడా భార్యపై తన ప్రేమను చూపించాడు. తనకు కూడా ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదని కామెంట్ చేశాడు.

ఇంగ్లాండ్ కి మహారాణిని చేయలేదు.

ఇంగ్లాండ్ కి మహారాణిని చేయలేదు.

అయితే ఓ లేడి జర్నలిస్ట్ వీరి ఫొటో పై స్పందిస్తూ.. అనుష్క గారు మిమ్మల్ని విరాట్ కోహ్లీ తల్లిని మాత్రమే చేశారు. ఇంగ్లాండ్ కి మహారాణిని చేయలేదు. మరీ అంతలా సంబరపడాల్సిన అవసరం లేదని వ్యంగ్యంగా కామెంట్ చేయడంతో తెలుగు దర్శకుడు మారుతి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. అంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుందని అన్నాడు.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
ప్రతి మహిళ ఒక మహారాణి: మారుతి

ప్రతి మహిళ ఒక మహారాణి: మారుతి

ఒక రాజ్యానికి రాణి అవ్వడం కంటే బిడ్డకు తల్లి అవ్వడమే ఒక మహిళకు చాలా గొప్ప విషయం. ఆ సంతోషాన్ని. ఎక్కువగా ఆస్వాదిస్తుంది. ఒక మహిళ జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధగా ఉంది. ఇక ప్రతీ మహిళ కూడా ఒక మహారాణి అని చెప్పవచ్చు. అనుష్క ఒక స్టార్ సెలబ్రెటీ అయ్యి ఉండవచ్చు. కానీ అంతకంటే ముందు ఆమె ఒక మహిళ. తల్లి కాబోతున్న ఆనంద క్షణాలను ఆమె ఆస్వాధించవచ్చు. ఆ హక్కు తనకు ఉంది అంటూ మారుతి వువరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X