బాలీవుడ్‌లోకి తెలుగు దర్శకుడు.. భలే భలే మగాడివోయ్ లేదా మరో మెగా హీరో సినిమాతో..
టాలీవుడ్ సినిమాలకు గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో గిరాకీ గట్టిగానే పెరుగుతోంది. మన కథలతో కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తెచ్చుకున్న హీరోలు దర్శకులు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇక కొందరు బాలీవుడ్ హీరోలైతే డైరెక్ట్ గా తెలుగు దర్శకులతోనే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల కాలంలో అలాంటి వారి సంఖ్య ఎక్కువవుతోంది. రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువయ్యేలా ఉంది. ఇక మారుతి కూడా బాలీవుడ్ సినిమాలకు రెడీ కానున్నట్లు టాక్.

భారీ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా అదే కథను బాలీవుడ్ కబీర్ సింగ్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా అతనికి బాక్సాఫీస్ హిట్ అందింది. దానితో పాటు మనోడు రణ్ బీర్ కపూర్ తో ఒక ఆఫర్ ను కూడా అందుకున్నాడు. త్వరలోనే అతనితో సినిమా చేయబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

మారుతి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు
జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా బాలీవుడ్ లో అదే కథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలో మరో దర్శకుడు మారుతి కూడా బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయంపై దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. బాలీవుడ్ ఎంట్రీ మాత్రం తప్పకుండా ఉంటుందని చెప్పడంతో ఎలాంటి సినిమా చేస్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.

ఆ రెండు సినిమాలతో..
బాలీవుడ్ కు చెందిన కొంతమంది ఫిల్మ్ మేకర్స్ తన హిట్ సినిమాలను రీమేక్ చేయమని కోరినట్లు వివరణ ఇచ్చారు. అయితే అందులో మారుతి ఎక్కువగా నాని భలే భలే మగాడివోయ్ సినిమాపైనే ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక ప్రతి రోజు పండగే సినిమాని కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సరైన హీరోతో ఈ రెండు సినిమాలు చేస్తే తప్పకుండా బాక్సాఫీస్ హిట్స్ అందుకోగలడని టాక్ వస్తోంది.
Recommended Video

నెక్స్ట్ సినిమా ఎవరితో..
మారుతి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో గాని నెక్స్ట్ అయితే మళ్ళీ తన రెగ్యులర్ తరహాలోనే టాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే రవితేజ లేదా రామ్ పోతినేనితో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. అలాగే గోపిచంద్ తో "పక్కా కమర్షియల్" అనే సినిమా కూడా చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వచ్చే ఏడాది వీలైనంత త్వరగా తన సినిమాపై క్లారిటీ ఇవ్వాలని మారుతి ట్రై చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











