twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో పెను విషాదం: కరోనాతో యంగ్ డైరెక్టర్ కన్నుమూత..చిరంజీవి, సప్తగిరి అండగా నిలిచినా!

    |

    మొదటి దశ కంటే రెండో దశలో కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మరీ ముఖ్యంగా ఈ సారి టాలీవుడ్‌పై ఇది తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పాటు సినీ కార్మికులు ఆ వైరస్‌ బారిన పడడంతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. కరోనా కారణంగా యంగ్ డైరెక్టర్ నంద్యాల రవి కన్నుమూశారు. ఆ వివరాలు మీకోసం!

    కరోనాతో నంద్యాల రవి కన్నుమూత

    కరోనాతో నంద్యాల రవి కన్నుమూత

    టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన.. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్సను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన కోలుకున్నారని అంతా అనుకున్నారు. కానీ, ఊహించిన విధంగా మరోసారి రవి ఆరోగ్యం విషమించింది. దీంతో ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాసను విడిచినట్లు తెలుస్తోంది.

    కరోనా బారిన పడిన నంద్యాల రవి

    కరోనా బారిన పడిన నంద్యాల రవి

    తెలుగు సినీ ఇండస్ట్రీలో రచయితగా.. దర్శకుడిగా పని చేసిన నంద్యాల రవి.. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. అప్పటి అక్కడే చికిత్సను తీసుకుంటున్నారు. రవికి కరోనానే కాకుండా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయట.

    హాస్పిటల్ బిల్ కట్టలేని పరిస్థితులు

    హాస్పిటల్ బిల్ కట్టలేని పరిస్థితులు

    నంద్యాల రవి చాలా రోజులు పాటు ఆస్పత్రితో చికిత్స తీసుకోవడంతో.. బిల్ రూ. 7 లక్షల వరకూ అయింది. దీంతో ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ విషయాన్ని వెల్లడించిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు పరిశ్రమలోని పెద్దలు సాయం అందించాలని అభ్యర్థించారు. అప్పటి నుంచే నంద్యాల రవి ఆరోగ్యం గురించి పలు కథనాలు వెలువడ్డాయి.

    అలా సహాయం అందించిన చిరంజీవి

    అలా సహాయం అందించిన చిరంజీవి

    నంద్యాల రవి కరోనాతో బాధ పడుతోన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు పలు రకాలుగా సహాయం అందించారు. తన బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తంతో పాటు ఫ్లాస్మా యూనిట్లను పంపించి ఆదుకున్నారు. అలాగే, కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ, ఈ వివరాలేమీ బయటకు రానీయలేదు. చిరంజీవి తీసుకున్న చొరవతో నంద్యాల రవికి కొంత ఉపశమనం కలిగింది.

    కమెడియన్ సప్తగిరి భారీ విరాళం

    కమెడియన్ సప్తగిరి భారీ విరాళం

    నంద్యాల రవి ఆస్పత్రి బిల్ కట్టలేని పరిస్థితి గురించి కథనాలు రావడంతో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి స్పందించాడు. ఈ మేరకు తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు. ఈ డబ్బులను రవి ఆస్పత్రి బిల్‌కు ఉపయోగించారట ఆయన కుటుంబ సభ్యులు. సప్తగిరి ఆర్థిక సహాయం చేసిన తర్వాత చాలా మంది ముందుకొచ్చి.. తలో కొంత ఇచ్చి అండగా నిలిచారు.

    నంద్యాల రవి సినీ ప్రయాణం ఇలా

    నంద్యాల రవి సినీ ప్రయాణం ఇలా

    నాగ శౌర్య - అవిక గోర్ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు నంద్యాల రవి. దీనికి దర్శకత్వంతో పాటు రచయితగా, స్క్రీన్ రైటర్‌గా చేశారాయన. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న ఆయన.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఒరేయ్‌ బుజ్జిగా'తో రచయితగా వచ్చాడు. అలాగే, ఈ మధ్యే వచ్చిన 'పవర్‌ ప్లే'కు సైతం స్క్రిప్ట్‌ రైటర్‌గా పని చేశాడు.

    Recommended Video

    Salaar కి Baahubali ఫార్ములా, Prabhas కి డైలాగ్స్ తక్కువ Prashant Neel స్కెచ్ || Filmibeat Telugu
    నంద్యాల రవి ఫ్యామిలీ నేపథ్యమిదే

    నంద్యాల రవి ఫ్యామిలీ నేపథ్యమిదే

    నంద్యాల రవిది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని సరిపల్లి గ్రామం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. అప్పటి నుంచి పలు చిత్రాల్లో రచయితగా, దర్శకుడిగా, స్క్రీన్ రైటర్‌గా భాగమయ్యారు. ఇక, నంద్యాల రవి మరణంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు

    English summary
    Nandyala Ravi made his directorial debut with ‘Lakshmi Raave Maa Intiki’ in 2014. After a long gap, he returned to Telugu cinema as a writer for ‘Orey Bujjiga’ and worked for the recently....
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X