ఆస్కార్ విన్నర్ మూవీ నచ్చలేదన్నందుకు.. రాజమౌళిపై విరుచుకుపడ్డ దర్శకుడు!
2019 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న కొరియన్ చిత్రం పారాసైట్. మొదట్లో ఆ సినిమా యవారేజ్ గా ఆడేస్తుందిలే అనుకున్నారు. కానీ రిలీజ్ అయిన వారానికి ఈ చిత్రం ప్రపంచం వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. హాలీవుడ్ ప్రముఖులు సైతం పారాసైట్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ రాజమౌళికి మాత్రం ఆ సినిమా కొంచెం కూడా నచ్చలేదట.

నిద్దరొచ్చేసింది..
నాలుగు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న సినిమా అంటే మినిమమ్ ఒక రేంజ్ సినిమా అయ్యి ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే రాజమౌళి మాత్రం ఎవరు ఊహించని విధంగా సినిమా చూస్తుంటే నిద్దరొచ్చేసిందిని కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కొందరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

విరుచుకుపడ్డ దర్శకుడు..
సినిమా చూస్తే నిద్ర వచ్చిందని జక్కన్న కామెంట్ చేయడం కొంత మంది సినీ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని అర్థమైపోయింది. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్నారు. 'మిఠాయి' దర్శకుడు ప్రశాంత్ కుమార్ ఎవరు ఊహించని విధంగా ఒక పెద్ద పోస్ట్ చేశాడు. ఆస్కార్ గెలిచిన సినిమాను అవమానించేలా కామెంట్ చేయడం సిగ్గు చేటు అని ఘాటుగా స్పందించారు.

మీరు కాపీ దర్శకుడు..
నేషనల్ వైడ్ గా బిగ్ బడ్జెట్ సినిమాలను తీసే అతికొద్ది మందిలో ముఖ్యమైన రాజమౌళిపై ప్రశాంత్ ఆయానవి కాపీ సీన్లు అంటూ కామెంట్ చేశారు. సై చిత్రంలో మీరు ఒక సీన్ ని చాలా బాగా కాపీ కొట్టారు. అలాగే మరొక సినిమాల్లో కూడా వేరే సినిమాల నుంచి కాపీ కొట్టారు. అలాంటి దర్శకుడైనా మీరు అద్భుతమైన పారాసైట్ సినిమాపై కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని ప్రశాంత్ వివరణ ఇచ్చాడు.

బాహుబలి గొప్ప సినిమానా?
వరల్డ్ వైడ్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ అందుకొని ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలిపై కూడా ఈ దర్శకుడు కామెంట్ చేయడం వైరల్ గా మారింది. బాహుబలి గురించి ప్రపంచంలోని ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్స్ మాట్లాడినట్లు నేనెక్కడా చూడలేదు. కానీ పారాసైట్ సినిమా అద్భుతమైన సినిమా.. అలాంటి క్రియేటివ్ వర్క్ పై రాజమౌళి ఇలా కామెంట్స్ చేయడం సిగ్గుచేటని ప్రశాంత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











