టాలీవుడ్ లో మరో విషాదం.. కరెంట్ షాక్ తో డైరెక్టర్ దుర్మరణం
చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. సినీ పరిశ్రమలో రాణించాలని భావించి హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా ఒక సినిమా చేసి మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక దర్శకుడు కరెంట్ షాక్ కారణంగా దుర్మరణం పాలైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి సిద్ధార్థ మరణించిన వార్త మరువక ముందే టాలీవుడ్ కి చెందిన మరో యువ దర్శకుడు దుర్మరణం పాలైన ఘటన టాలీవుడ్ వర్గాలలో విషాదాన్ని నింపింది. పైడి రమేష్ అనే ఒక యంగ్ డైరెక్టర్ గతంలో రూల్ అనే సినిమా చేశాడు. అయితే అది ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి మరో కథతో ఎలా అయినా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
అందులో భాగంగానే రెండో సినిమాకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన యూసఫ్ గూడా లోని ఒక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే సాయంత్రం ఎప్పటిలాగే బయటకు వాకింగ్ కి వెళ్లి రూమ్ కి వచ్చిన క్రమంలో వర్షం మొదలైంది. అయితే ఆ సమయానికి బాల్కనీలో తీగల మీద బట్టలు ఆరవేసి ఉన్నాయి. వర్షానికి ఆ తీసే ప్రయత్నం చేశాడు. అయితే పెద్ద ఎత్తున గాలి దుమారం రేగడంతో గాలికి కొన్ని బట్టలు వెళ్లి అక్కడ బాల్కనీ ఎదురుగ ఉన్న కరెంటు తీగల మీద పడ్డాయి. ఈ నేపథ్యంలోనే వాటిని ఒక సాయంతో తీసేందుకు సదరు దర్శకుడు ప్రయత్నం చేశాడు. అయితే అవి హై ఓల్టేజీ వైర్లు కావడంతో గట్టి షాక్ కొట్టింది.

షాక్ కొట్టిన సమయంలో నాలుగో అంతస్తు నుంచి కిందకి పడిపోయాడు.. నాలుగు అంతస్తులు ఎత్తు నుంచి కింద పడడంతో అక్కడికక్కడే ఆయన దుర్మరణం పాలయ్యారు.. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు చేరుకుని ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఆయన మృతదేహాన్ని అందించనున్నామని వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన ఒక వర్ధమాన దర్శకులు ఇలా దుర్మరణం పాలయ్యాడు అన్న విషయం తెలుసుకున్న అనేకమంది సినీ ప్రముఖులు, టెక్నీషియన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.


Click it and Unblock the Notifications