Surya Kiran Passed Away సత్యం ఫేమ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత... ఎలా చనిపోయారంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త, దర్శకుడు,నటుడు సూర్య కిరణ్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు(మార్చి 11) చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పచ్చ కామెర్ల వ్యాధితో బాధపడుతూ మరణించినట్లు తెలిసింది. ఆయన మృతి పట్ల అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండస్ట్రీ సంతాపం తెలుపుతోంది.

తెలుగులో సత్యం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సూర్య కిరణ్. ఆయనకు కేరళాకు చెందిన వ్యక్తి. మలయాళ చిత్రాలతో కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ నటుడిగానూ మెప్పించారు. 1978లో స్నేహిక్కన్ ఓరు పెన్ను చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ, తమిళం, తెలుగులోనూ నటించారు. 1986లో చిరంజీవి హీరోగా విడుదలైన రాక్షసుడు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అనంతరం తెలుగులో దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెం 786, కొండవీటి దొంగ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. చిరంజీవితో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వంటి పెద్ద స్టార్లతో కలిసి సినిమాల్లో నటించారు.
అలా దర్శకుడిగా... 2003లో సత్యం చిత్రంతో దర్శకుడిగా మారారు సూర్య కిరణ్. అక్కినేని సుమంత్ - జెనీలియా హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. నాగార్జున ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మంచి విజయం సాధించింది. ఇక తన తొలి చిత్రమే హిట్ సాధించడంతో యాక్టింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా కెరీర్‌ను కొనసాగించారు సూర్య కిరణ్. ఆ తర్వాత మళ్లీ సుమంత్‌తోనే ధన 51 చిత్రం చేయగా ఫర్వాలేదనిపించింది. అనంతరం జగపతిబాబుతో బ్రహ్మాస్త్రం, మంచు మనోజ్ తో రాజు భాయ్, చివరగా ఛాప్టర్ 6 అనే చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.

హీరోయిన్‌తో పెళ్లి, విడాకులు.. ఇదే సమయంలోనే మాజీ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సూర్య కిరణ్. ఆ తర్వాత కొంత కాలం కాపురం చేసిన ఈ జంట తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఇద్దరు డివొర్స్ తీసుకుని అందర్ని షాక్‌కు గురి చేశారు. అనంతరం ఎవరి జీవితం వాళ్లు గడుపుతున్నారు. అయితే వీరి విడాకుల గురించి అనేక పుకార్లు వచ్చాయి. జగపతిబాబుతో హీరోయిన్ కళ్యాణి ఎఫైర్ నడిపిందని అన్నారు. మరి కొంతమంది ఆర్ధిక కష్టాలు వల్ల విడిపోయారని చెప్పారు. విడిపోయాక ఓ సందర్భంలో తామిద్దరి మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తప్పని సరి పరిస్థితుల్లో విడిపోయినట్లు తెలిపారు సూర్య కిరణ్.
బిగ్‌బాస్‌లోనూ సందడి.. సూర్య కిరణ్ నటుడిగా, దర్శకుడిగా మాత్రమే కాదు బుల్లితెరపైనా సందడి చేశారు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని ప్రేక్షకుల్ని అలరించారు. బిగ్ బాస్ 4వ సీజన్ కంటెస్టెంట్‌గా వచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ సీజన్ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయిపోయారు.


Click it and Unblock the Notifications











