టాలీవుడ్‌లో మరో పెళ్లి: ఓ ఇంటి వాడైన టాలెంటెడ్ డైరెక్టర్.. హీరోహీరోయిన్ల సందడి
కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో షూటింగులు సైతం నిలిపివేయాల్సి వచ్చింది. మొత్తంగా ఆ మహమ్మారి వల్ల చాలా మందికి ఇబ్బందులు తప్పలేదు. ఇలాంటి సమయంలో కొందరు సినీ ప్రముఖులు మాత్రం తమ జీవితాల్లో వెలుగులు నింపుకున్నారు. మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాలను ప్రారంభించారు. ఇప్పటికే టాలీవుడ్‌లో నితిన్, నిఖిల్ సిద్దార్ధ్, రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ సహా ఎంతో మంది వివాహం చేసుకున్నారు. ఇప్పుడా జాబితాలోకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వచ్చి చేరాడు.
'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' వంటి విభిన్నమైన చిత్రాలతో తన సత్తాను నిరూపించుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. తాజాగా అతడు శ్రీజ గోనీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఇక, ఇదే వేడుకకు సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్ నివేదా థామస్, హీరో శ్రీ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సహా పలువురు విచ్చేసి, వధువరులను ఆశీర్వదించడంతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా అతడి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉండగా, మొదటి రెండు సినిమాలతో తనలోని సత్తాను నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా 'అంటే.. సుందరానికీ' అనే సినిమా చేస్తున్నాడు. దీనిని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. అలాగే, వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమా కర్టన్‌రైజర్ వీడియో విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ వీడియోలో సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.


Click it and Unblock the Notifications











