twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ రోజు నుంచి 'సినిమా హోర్డింగ్స్' కు బై

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇక నుంచి మనకి రోడ్డు ప్రక్కన మన తెలుగు సినిమా హోర్డింగ్స్ కనిపించవు. నవంబరు 1వ తేదీ నుంచి హోర్డింగుల మీదనో, లాలీపాప్స్‌పైనో సినీ నటులు కనిపించరు. కారణం ఏమిటంటే - ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా ప్రచారానికి హోర్డింగులూ, లాలీపాప్స్‌ లాంటివి ఉపయోగించకూడదని నిర్మాతల మండలి నిర్ణయించింది. హోర్డింగుల సంఖ్యను తగ్గించాలని హైదరాబాద్‌ నగర పాలక సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సినిమా హోర్డింగులను తీసేయాలని తీర్మానించింది.

    సినీ నిర్మాణ వ్యయంలో పబ్లిసిటీకి కొంత భాగం కేటాయిస్తారు. ఇటీవల కాలంలో తమ చిత్రం గురించి ప్రేక్షకులకు తెలిపేందుకు హోర్డింగులను నిర్మాతలు ఆశ్రయిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలోనూ, పెద్ద భవంతులపైనా భారీగా పోస్టర్లను అతికిస్తుంటారు. ఆకర్షణీయమైన డిజైన్లతోవాటిని తీర్చిదిద్దుతుంటారు. అలాగే బస్టాపుల దగ్గరా వినైల్స్‌ని ఉంచుతున్నారు. రోడ్డు డివైడర్లలో ఉంచే పోస్టర్లను లాలీపాప్స్‌ అంటారు. వీటిని ఎంత ఎక్కువగా పెడితే అంత ఎక్కువ ప్రచారం చేసినట్లుగా చిత్ర వర్గాలు భావిస్తుంటాయి. అయితే వీటిపై వేటు పడటం జరగటం కొందరకి ఆనందాన్ని,మరికొందరకి భాధను కలిగిస్తోంది.

    హైదరాబాద్‌లో కొన్ని కూడళ్లలో హోర్డింగ్‌కి నెలకు అద్దె రూ.3 నుంచి 5 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు చలనచిత్ర వాణిజ్యమండలికీ, ఇతర విభాగాలకు ఈ విషయాన్ని తెలిపారు. సినిమా గురించి నేటి తరం ప్రేక్షకులకు టీవీలు, వెబ్‌ మాధ్యమాల ద్వారానే ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి హోర్డింగులు లేకపోయినా ఇబ్బందిలేదని నిర్మాతలంటున్నారు. వాల్‌ పోస్టర్లు అతికించడమ్మీద కొన్ని నగరాల్లో ఆంక్షలున్నాయి. దాంతో అక్కడి థియేటర్లవాళ్లు తమ ప్రాంగణాల్లోనే పోస్టర్లు అతికించుకొంటున్నారు. అయితే హోర్డింగ్స్ తయారీ మీద ఆధారపడి బ్రతుకుతున్నవారు మాత్రం ఒక్కసారిగా తమ జీవనోపాధిపై దెబ్బ పడిందంటున్నారు.

    ఈ విషయమై నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ''ఈ నిర్ణయం వల్ల నిర్మాతలకు చాలా భారం తగ్గినట్టే. ఒకరు పెట్టారని మరొకరు హోర్డింగులను భారీగా పెడుతున్నారు. దీని మూలంగా వచ్చే ఉపయోగం నామమాత్రమే అని పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. తాజా నిర్ణయం వల్ల సగటున రూ.50 లక్షలు ఖర్చు నిర్మాతకి తగ్గుతుంది. కొందరు నిర్మాతలైతే కోటిన్నర రూపాయల వరకూ ఈ తరహా ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఇక గోడ మీద పోస్టర్లు అతికించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు'' అన్నారు.

    English summary
    From November 1st, movie production houses will not be allowed to advertise on advertising lollipops and billboards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X