twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ బుల్లి తెరపై... టాలీవుడ్ హీరోల పాగా: సైడ్ ఇనకం అదుర్స్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమాలు రోజు రోజుకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాయి. సినిమాల మార్కెట్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా అందులో నటించే స్టార్స్‌కు అదనంగా ఆదాయం వచ్చి పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, జూ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమ సినిమాల బిజినెస్ ఎంత పెరిగితే అంత ఎక్కువగా నిర్మాతల నుంచి వసూలు చేస్తుంటారు. వాళ్లకున్న డిమాండ్ అలాంటిది మరి...

    గత కిద్దికాలంగా టాలీవుడ్ హీరోల సినిమాలకు సరికొత్త మార్గాల్లో ఆదాయం వచ్చి పడుతోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు థియేటర్ల నుంచి వచ్చే డబ్బులు కాకుండా టీవీ రైట్స్(ఆంద్రప్రదేశ్‌లో...) ద్వారా అదనంగా ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు నార్త్ ఇండియా వ్యాప్తంగా ఉండే హిందీ ఛానల్స్‌లో కూడా మన తెలుగు సినిమాలు ప్రదర్శితం అవుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి.

    దేశంలోనే టాప్‍లో ఉన్న జీ టీవీ, సోనీ టీవీ, స్టార్ టీవీ లాంటి పెద్ద హిందీ ఛానల్స్ మన తెలుగు సినిమాలను కొని హిందీలో అనువదించి తమ ఛానల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల తర్వాత హిందీ ఛానల్స్ లో ఎక్కువ ప్రదర్శితం అయ్యే సినిమాలు మన తెలుగు డబ్బింగ్ సినిమాలే అంటే అతిశయోక్తి కాదు.

    Ram Charan Teja-Pawan Kalyan-Mahesh Babu-Jr Ntr

    ఈ కారణంగా... ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు రూ. కోట్లలో శాటిలైట్స్ రూపేణ ఆదాయం వచ్చి పడుతోంది. ఇలా శాటిలైట్స్ రైట్స్ అదనంగా వచ్చిందంటే..... స్టార్ హీరోల ఖాతాల్లోకి అదనంగా సైడ్ ఇన్‌కం వచ్చి చేరినట్లే. ఈ మధ్య పెద్దగా ఆడని సినిమాలు కూడా శాటిలైట్స్ రూపంలో వచ్చిన డబ్బులతో గట్టెక్కుతున్నాయి. అదన్నమాట ఆదాయ రహస్యం.

    హిందీ టీవీ ఛానల్స్ మన తెలుగు సినిమాలను హీరో రేంజి, పాపులారిటీని బట్టి రూ. 20 లక్షల నుంచి కోటి వరకు చెల్లించి దక్కించుకుంటున్నాయి. వీటికితోడు తెలుగు ఛానల్స్‌లో ప్రదర్శించే హక్కులు రూపేణ వచ్చే ఆదాయం అదనం. ఇలా అన్ని వైపులా ఆదాయం వస్తుంది కాబట్టే స్టార్ హీరోల సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూ. 4 కోట్ల వరకు వెలుతుంది.

    నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రెబల్, జంజీర్ లాంటి సినిమాలు ఇటీవల భారీగా శాటిలైట్స్ రైట్స్ సాధించిన సినిమాలుగా చెప్పుకోవచ్చు. ఇందులో నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు అత్యధికంగా శాటిలైట్ రైట్స్(3 నుంచి 4 కోట్లు) రూపేణ ఆర్జించాయి.

    English summary
    Tollywood stars Pawan, Mahesh, Ram Charan, Jr Ntr, Prabhas's films are selling like hot cakes on Hindi television channels, bringing in a new source of income for beleaguered Tollywood producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X