వైయస్సార్ పై నటీనటుల స్పందన..

By Sindhu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన వంతు బాధ్యతలు నిర్వహించి జననేతగా అందరి మనస్సులో నిలిచిపోయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి(నేడు)జయంతి సందర్భంగా నటీనటుల స్పందన...దాసరి నారాయణ రావు: నేడు వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని దాసరి మాట్లాడుతూ..నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇచ్చేవ్యక్తి ఆయననీ, అలాగే తన కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని ప్రాణానికి ప్రాణంగా భావిస్తారు అని అన్నారు. ఆయన పరిచయం మరిచిపోలేనిదనీ ఆయన గొప్ప సీఎంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారనీ ఆవేదన వ్యక్తం చేశారు.

రామానాయుడు: నా జీవితంలో గుర్తుండి పోయే వ్యక్తి వైయస్సార్, తను వ్యక్తిగతంగా ఇష్టపడే వ్యక్తుల్లో రాజశేఖర్ గారు ఒకరని, సినీ పరిశ్రమకి ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండే వ్యక్తి వైయస్ ఆర్ అని నేడు ఆయన మన మధ్య లో లేకపోవడం బాధగా ఉందన్నారు.

హన్సిక: ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది..తను ఇక్కడి అమ్మాయిని కాననీ కాని ఇక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇక్కడి రాజకీయాల గురించి తెలుసుకున్నాననీ..రాజశేఖర రెడ్డిగారు ప్రజల గురించి చేపట్టిన ఎన్నో పథకాల గురించి తెలుసుకున్నాననీ ఆయన గొప్ప వ్యక్తి అని అన్నారు. పేదవాళ్ళకి ాయన చేసిన మేలు మరువలేనిది..ఆయన లేని లోటు ఎవ్వరు భర్తీ చేయలేరు.

రవితేజ: ఆయన మేలు పొందిన ప్రతి ఒక్కరి జన్మదినం ఇవాళ...వైయస్సార్ గారు చనిపోయిన రోజును మరిచిపోలేనని..ఆయన మన మధ్య లేకపోవడం దురదష్టకరం అని అన్నారు. ఈ రోజు ఆయన మేలు పొందిన ప్రతి ఒక్కరి పుట్టిన రోజుగా భావించాలని అన్నారు.

రాజేంద్రప్రసాద్: ఆయన నవ్వే మనకు ఎనర్జీ..ప్రజల కోసం ప్రతి క్షణం తాపత్రయ పడే వ్యక్తిగా, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కలబోసిన వ్యక్తి వైయస్సార్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆయనను చూడగానే మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ ధీమా, పాజిటివ్ ఎనర్జీ ప్రజల్లో కలిగేది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X