డ్రెస్ రీపీట్ చేస్తే తప్పేంటంట.. అక్కినేని కోడలు కొత్త స్ట్రాటజీ
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ స్టేట్మెంట్ ఏర్పరచుకున్న నటీమణి ఎవరా అంటే.. ఠక్కున సమంత పేరే చెబుతారు. అంతగా.. అమ్మడు తన ఫ్యాషన్ సెన్స్ తో జనాలను కట్టిపాడేసింది. ఎలాంటి ప్రత్యేకమైన ఈవెంట్ అయినా సరే అమ్మడు తన అన్ కన్వెంషనల్ స్టైల్ స్టేట్మెంట్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతుంటుంది. అయితే తాజా సామ్ తన పద్ధతిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యమైన ఈవెంట్ ల కోసం ప్రత్యేకంగా ముస్తాబవ్వడం సమంత ప్రత్యేకత. తన డ్రెస్సింగ్ లో ఏదోక కొత్తదనం కనిపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంది.
దానికి తగ్గట్లే డిజైనర్లు కూడా ఎప్పటికప్పుడు ఆమె విషయంలో తమ బుర్రలకు పదును పెడుతూనే ఉంటారు. వేసిన డ్రెస్ వేయకుండా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా కొత్త మెరుపులు మెరిపించడం అనేది ఫ్యాషన్ ఇండస్ట్రీ ప్రథమ సూత్రం. దాన్ని అమ్మడు తూ.చ. తప్పకుండా ఫాలో అయ్యేది. అయితే.. రానా నిశ్చితార్థ వేడుక సాక్షిగా అమ్మడు తన స్ట్రాటజీని మార్చుకున్నట్లే కనిపిస్తోంది.

ఇంతకూ విషయం ఏమిటంటే దగ్గుబాటి వారింట జరిగిన వేడుకలో సామ్ ఎప్పటిలాగానే అందమైన డ్రెస్సింగ్ స్టైల్ తో అందరినీ కట్టిపాడేసింది. పసుపుపచ్చని సల్వార్ సూట్ లో తళుక్కుమంది. సవ్యసాచి డిజైన్ చేసిన ఈ డెస్సుకు సామ్ ఒంపులే మరింత వెన్నె తెచ్చాయా అన్నట్లు ఉంది. ఇక, మెడలో చిన్నపాటి నల్లపూసల సెట్ ధరించిన సమంత చూడముచ్చటగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే, సరిగ్గా ఇదే డ్రెస్ ను అమ్మాయి కొంత కాలం క్రితం వేరే ఈవెంట్ కు వేసుకుంది అన్నది టాక్.
2018లో ఓ ఈవెంట్ కు ఇదే డ్రెస్ వేసుకున్న సమంత... అప్పుడు కూడా లూజ్ హెయిర్ తో, మెడలో చోకర్ సెట్ వేసుకుని సందడి చేసింది. ఇహ ఎప్పటిలాగానే అమ్మడి ఈ లుక్ కూడా ఫుల్ ట్రెండ్ అయింది. అయితే ఇలా డ్రెస్ లు రిపీట్ చేయడం అనేది ఫ్యాషన్ వరల్డ్ లో పెద్ద విషయమే అయినప్పటికీ, సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో డ్రెస్ లు రిపీట్ చేస్తుండటం మంచి పరిణామమేనని ఫ్యాషన్ గురువులు చెబుతున్నారు. మరి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన సామ్, ఇకపై ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











