ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అసిస్టెంట్ అరెస్ట్
హైదరాబాద్: టాలీవుడ్లో టాప్ ఫైట్ మాస్టర్లుగా కొనసాగుతున్న రామ్ లక్ష్మణ్ వద్ద పని చేసే అసిస్టెంట్ ఒకరిని పోలీసులు అరెస్టు చేసారు. అతని పేరు పద్దిరెడ్డి ఓబుల్ రెడ్డిగా పోలీసులు తెలిపారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ వద్ద అసిస్టెంటుగా పని చేస్తున్నాడని, చైన్ స్నాచింగ్ కేసులో అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.

జల్సాలకు అలవాటు పడిన ఓబుల్ రెడ్డి గత కొంత కాలంగా చైన్ స్నాచింగుకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుండి రూ. 1.35 లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఓబుల్ రెడ్డి ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేసాడనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
సినీ పరిశ్రమలో ఎప్పుడూ బిజీగా ఉండే రామ్ లక్ష్మణ్ వద్ద పని చేసే వారికి చేతి నిండా పని ఉంటుంది. అయితే ఓబుల్ రెడ్డి లాంటి వారు జల్సాలకు అలవాటు పడి ఇలా దొంగతనాలకు అలవాడు పడ్డట్లు స్పష్టమవుతోంది. పట్టుబడిన వ్యక్తి రామ్ లక్ష్మణ్ వద్ద పని చేసిన అసిస్టెంట్ కావడంతో విషయం హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications