టాలీవుడ్ నిర్మాత ఇంట్లో అక్రమ తుపాకులు, అరెస్ట్
హైదరాబాద్ : టాలీవుడ్ నిర్మాత రామకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు 2 లైసెన్స్ లేని తుపాకులు, 14 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
అయితే రామకృష్ణ మాత్రం ప్రాణభయంతోనే వాటిని తన వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబంలో భూ తగాదాలు ఉన్నాయని, వారి నుంచి ప్రాణభయం ఉందని, గన్ లైసెన్స్ గురించి పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదని వెల్లడించారు.
రామకృష్ణ గతంలో...పోసాని కృష్ణ మురళితో 'నా పెళ్లాం నా ఇష్టం' చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వెంటకలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రామకృష్ణ వీర్నాల స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, సుహాసిని, రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ మధ్య టాలీవుడ్లో కొందరు దర్శకులు, నిర్మాతలు, నటులు వివిధ కేసుల్లో పోలీస్ స్టేషన్ గడప తొక్కడం సర్వసాధారణం అయిపోయింది. ఆ మధ్య కొందరు నిర్మాతలు, నటులు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. వ్యబిచారం నడిపిస్తూ కొందరు, ఇతర నేరాతలతో మరికొందరు అరెస్టయ్యారు. తాజాగా నిర్మాత ఇంట్లో లైసెన్స్ లేని తుపాకులు దొకరడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











