టాలీవుడ్లో మరో లేడీ డైరెక్టర్ వచ్చేసింది
హైదరాబాద్: చిత్ర పరిశ్రమకు మహిళా దర్శకులు కొత్త కాకపోయినా...తెలుగులో మాత్రం వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. విజయ నిర్మల, బి.జయ, నందినీ రెడ్డి లాంటి వారు దర్శకులుగా తమ సత్తా చాటుకున్నారు. తాజాగా ఆ జాబితాలో స్థానం సంపాదించుకునేందుకు సిద్దమవుతున్నరు యువ మహిళా దర్శకురాలు చునియా.
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ 'అన్నపూర్ణ స్టూడియోస్' నిర్మించిన 'యువ' అనే ధారావాహిక ద్వారా దర్శకురాలిగా పరిచయమైన చూనియా, తర్వలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తీక్ రాజు కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

చునియా మాట్లాడుతూ.... 'టెలివిజన్ రంగంలో ఎంతో కష్టపడి సినిమాల్లోకి వస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. అదే సమయం బాధ్యత పెరుగింది కాబట్టి కాస్త భయం కూడా మొదలైంది. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను' అన్నారు.
గతంలో చూనియా తాను దర్శకత్వం వహించిన ధారావాహికలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, అందాల భామ అనుష్క చేత ప్రత్యేక పాత్రలు చేయించారు, ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే.మేయర్ ఈ ధారావాహికకు సంగీతం అందించగా, రవీందర్ కళా దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications