ఏప్రిల్‌లోనే నరకాసుర వధ.. కరోనాపై పోరాటానికి కదిలిన టాలీవుడ్.. చిరు, నాగ్, వెంకీ..
నావల్ కరోనావైరస్, కోవిడ్ 19పై పోరాటానికి సూచకంగా కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం ప్రకటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. మనమంతా ఒక్కటే అనే భావన కల్పించడానికి చేసిన ప్రయత్నానికి తెలుగు సినీ పరిశ్రమ అద్భుతంగా స్పందించింది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత భారీ సంఖ్యలతో దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఎలా స్పందించారో మీరే చూడండి..

చిరంజీవి ఫ్యామిలీ
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి దీపాలను వెలిగించి కరోనాపై పోరాటం చేస్తున్న ప్రతీ ఒక్కరికి మానసిక స్థైర్యాన్ని అందించారు. ప్రధాని ప్రకటన వచ్చినప్పటి నుంచి చిరంజీవి పలు వీడియోలను రిలీజ్ చేసి ప్రజలను మానసికంగా సంసిద్ధం చేశారు.

నాగార్జున కుటుంబం
ఇక లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో అక్కినేని నాగార్జున కుటుంబం చాలా యాక్టివ్‌గా కనిపించింది. మొదటి నుంచి అక్కినేని నాగార్జున ఫ్యామిలీ అన్ని రకాల చేయూతను ఇస్తున్నది. దీపాలు వెలిగించే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ప్రజలను సోషల్ మీడియా ద్వారా కోరిన విషయం తెలిసిందే.

వెంకీ స్టయిల్‌తో
ఇక విక్టరీ వెంకటేష్ తనదైన స్టయిల్‌లో లైట్ ఫర్ ఇండియాకు మద్దతు పలికారు. దీపాలను వెలిగించి తన నివాసంపై నుంచి పోరాటానికి మద్దతు తెలిపారు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొన్నారు.

మంచు ఫ్యామిలీ తారల వెలుగు జిలుగులు
ఇక మంచు ఫ్యామిలీ పూర్తిగా లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగమైంది. మోహన్ బాబు, మంచు విష్ణుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు లక్ష్మి నివాసంలో మంచు మనోజ్ కనిపించారు. దీపాలు వెలిగించి తమ సామాజిక బాధ్యతను గుర్తు చేసుకొన్నారు.

స్టైలిష్ స్టార్ కుటుంబం
ప్రధాని పిలుపు మేరకు లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో అల్లు అరవింద్ కుటుంబం పూర్తిస్థాయిలో భాగమైంది. అల్లు అర్జున్‌తో కలిసి అరవింద్ పాల్గొన్నారు. దేశ ప్రజలకు మనమంతా ఒక్కటే అనే నినాదాన్ని వెలుగుల విరజిమ్మడం ద్వారా స్టైలిష్ స్టార్ తన సందేశాన్ని తీసుకెళ్లారు.

టాలీవుడ్ ప్రముఖులందరూ
ఇక లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో ఉత్తేజ్ దంపతులు, లావణ్య త్రిపాఠి, పూజా హెగ్డే, తమన్నా, కృష్ణంరాజు, సాయికుమార్ దంపతులు, గోపిచంద్, యాక్షన్ కింగ్ అర్జున్, రజనీకాంత్, రాజశేఖర్ దంపతులతోపాటు సినీ పరిశ్రమలోని పలువురు ఇందులో భాగమయ్యారు.


Click it and Unblock the Notifications











