రెండుసార్లు కరోనాను బోల్తా కొట్టించిన అల్లు అర్జున్.. మీమ్స్ చూస్తే పడి పడి నవ్వుకోవాల్సిందే
కరోనా దెబ్బ తో మరోసారి పెద్ద సినిమాలలు వాయిదా పడక తప్పడం లేదు. ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన RRRకు కూడా ఈసారి చేదు అనుభవం ఎదురవుతుంది. సంక్రాంతికి వస్తుందని అనుకున్నా బిగ్ బడ్జెట్ సినిమా మళ్ళీ ఐదవ సారి వాయిదా పడింది.. అయితే కరోనా కష్టకాలంలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి.. అయితే ఈ పాండమిక్ లో అందరికంటే అదృష్టవంతుడు అల్లు అర్జున్ అనే చెప్పాలి. ఒక విధంగా అతను ఐకాన్ స్టార్ కాదు.. లక్కీ స్టార్ అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వెలువడుతున్నాయి.

ఫస్ట్ వేవ్ లో అలా..
అల్లు అర్జున్ 2020 లో అల.. వైకుంఠపురములో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను అందుకని ఆ ఏడాది నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. ఇక ఆ సినిమా విడుదలై మంచి వసూళ్లను అందుకున్న తర్వాతనే ఫస్ట్ వేవ్ మొదలయ్యింది. లాక్ డౌన్ వచ్చి పోవడంతో చాలా పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి.

మరోసారి తప్పించుకున్న బన్నీ
ఇక థర్డ్ వేవ్ సమీపంలో ఉండగా అల్లు అర్జున్ పుష్ప సినిమా సేఫ్ జోన్ లో 300 కోట్ల గ్లాస్ కలెక్షన్స్ అందుకుని మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఒక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరొకవైపు ఓమిక్రాన్ భయ పెడుతున్న సమయంలో అల్లు అర్జున్ ధైర్యంగా అడుగు వేసి పుష్ప సినిమాను విడుదల చేశాడు. అది కూడా దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం విశేషం.

లక్కీ స్టార్..
అల్లుఅర్జున్ రెండుసార్లు కరోనా ఇబ్బందులను దాటి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకోవడం తో సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా అతను స్టైలిష్ స్టార్ స్టార్ కాదని అంటూ.. లక్కీ స్టార్ అని మీమ్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

RRR బ్యాడ్ లక్
నిజంగా సినిమా సక్సెస్ అవ్వాలి అంటే భారీ బడ్జెట్ టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి అని అల్లు అర్జున్ ని చూస్తేనే అర్థమవుతుంది. RRR సినిమా కోసం దాదాపు అన్ని ఇండస్ట్రీలోని సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని కూడా చెప్పవచ్చు. కానీ అలాంటి సినిమాకు కొంత అదృష్టం కూడా కలిసి రావడం లేదు. దాదాపు అయిదు సార్లు ఆ సినిమా వాయిదా పడింది.

మరో బ్రేక్ రావడంతో..
అల.. వైకుంఠపురములో విడుదల కంటే ముందు అల్లు అర్జున్ కాస్త వరుస అపజయాలతో ఉన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత లాక్ డౌన్ వచ్చినప్పటికీ దాదాపు రెండేళ్ల వరకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు థర్డ్ వేవ్ తో మరో బ్రేక్ రావడంతో పుష్ప విజయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఏదేమైనా బన్నీ మాత్రం లక్కీ స్టార్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











