హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ కలకలం.. పోలీసుల అదుపులో హీరో, హీరోయిన్?

గత కొద్దికాలంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కల్చర్ మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్ యువకుడు ఒకరు డ్రగ్ ఓవర్ డోస్ వల్ల మరణించిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ మీద, డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అని స్థావరాల మీద దృష్టి పెట్టారు. అందులో భాగంగానే తెల్లవారుజామున హైదరాబాద్ లో ఒక పబ్ మీద దాడి చేయగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు సినీ ప్రముఖులు కొందరు పట్టుబడినట్లు తెలుస్తోంది పట్టుబడిన వారిలో ఒక సినీ హీరో, హీరోయిన్ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

పబ్ మీద దాడి

పబ్ మీద దాడి

గత కొంత కాలంగా తెలంగాణ పోలీసులు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అమూల్య పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఒకరు డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మరణించారు. ఈ వ్యవహారంతో తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడే పరిస్థితి రావడంతో పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సమయం దాటినా ఒక పబ్లో లేట్ నైట్ పార్టీ జరుగుతుందని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ పబ్ మీద దాడి చేశారు.

టాలీవుడ్ హీరో, హీరోయిన్ కూడా

టాలీవుడ్ హీరో, హీరోయిన్ కూడా

హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న పుడ్డింగ్ అండ్ మింక్ అనే పబ్ మీద పోలీసులు దాడి చేశారు ఈ పబ్ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ కూతురు పబ్ గా చెబుతున్నారు. అయితే పోలీసులు దాడి చేస్తున్న సమయంలో 150 మంది పబ్ లో ఉన్నారని వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది. వారిలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా ఒక టాలీవుడ్ హీరో, హీరోయిన్ కూడా ఉన్నారని తెలుస్తోంది.

 టాలీవుడ్ లో చర్చనీయాంశంగా

టాలీవుడ్ లో చర్చనీయాంశంగా

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇటీవలే హీరోగా మారిన సదరు హీరో నే కాకుండా ఒక టాలీవుడ్ హీరో కుమార్తె, అలాగే హీరోయిన్ గా మారిన మరో సీనియర్ నటుడి కుమార్తె కూడా స్పాట్ లో ఉన్నారని తెలుస్తోంది.. అలా మొత్తం 150 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు ఈ సమయంలో 39 మంది యువతులు ఉన్నారు అని గుర్తించారు. అలాగే ఈ పార్టీ లో డ్రగ్స్ వాడినట్లుగా కూడా పోలీసులు ఆధారాలు లభించాయని తెలుస్తోంది.

 పేర్లు ప్రస్తావించడం లేదు

పేర్లు ప్రస్తావించడం లేదు

సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అందులో 145 మందిని వివరాలు తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అని కేవలం ఐదుగురిని మాత్రమే పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉంచుకున్నారు అని తెలుస్తోంది.. వీళ్ళలోనే హీరో, హీరోయిన్ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతుండగా దానికి సంబంధించి మీడియా ఎవరి పేర్లు ప్రస్తావించడం లేదు. పోలీసులు దాడి చేస్తున్న సమయంలో డ్రగ్స్ ని బాత్రూంలో అలాగే కిటికీ గ్రిల్స్ నుంచి కూడా బయటకు విసిరేందుకు ప్రయత్నించారని గుర్తించారు. మొత్తం మీద అలా విసిరి వేసిన ప్యాకెట్లను సేకరించిన పోలీసులు మొత్తం ఆరు గ్రాముల కొకైన్ దొరికిందని చెబుతున్నారు.

టాలీవుడ్ లో చర్చనీయాంశంగా

టాలీవుడ్ లో చర్చనీయాంశంగా

నిజానికి ఈ పబ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉండడంతో అర్ధరాత్రి దాటాక కూడా పార్టీలు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే టాస్క్ ఫోర్స్ ఎంటరైన క్రమంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారని తెలుస్తోంది.

ఈ పబ్ ఒక రాజకీయ నాయకుడు కుమార్తెది కావడం, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పబ్ కి వస్తూ ఉండటంతో పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహారంలో ఎవరెవరు పేర్లు బయటకు వస్తాయి అనేది టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X