అదుపుతప్పి బోల్తా పడిన హీరో రాజ్ తరుణ్‌ కారు.. ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన నటుడు

Recommended Video

Hero Raj Tarun Escaped From Major Road Mishap || Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్‌ కారుకు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనలో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడడని తెలుస్తోంది. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్‌ ఎక్కడికి వెళ్లాడు అన్నది తెలియరాలేదు.

హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

రాజ్ తరుణ్‌ తన కారులో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలుస్తోంది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు.

అతివేగమా..? నిద్ర మత్తా..?

అతివేగమా..? నిద్ర మత్తా..?

తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో నిద్రమత్తు వల్లే జరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన తీరు.. కారు పల్టీలు కొట్టిన పరిస్థితులు గమనిస్తే ఇది అతివేగం వల్లే జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని సమాచారం. అధిక వేగం వల్ల రావడంతోనే కారు అన్ని పల్టీలు కొట్టిందని కూడా స్థానికులు చెబుతున్నారని తెలుస్తోంది.

రాజ్ తరుణ్‌ ఎక్కడ..?

రాజ్ తరుణ్‌ ఎక్కడ..?

ప్రమాదం జరిగిన తర్వాత రాజ్ తరుణ్‌ చిన్న చిన్న గాయాలతో స్వయంగా బయటకు వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత అతడు ఫోన్‌లో ఎవరికో సమాచారం అందించాడని అంటున్నారు. వాళ్లు కారులో వచ్చి రాజ్ తరుణ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. అయితే, ఎక్కడికి తీసుకెళ్లారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. పోలీసులు కూడా రాజ్ తరుణ్‌ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.

ఎయిర్ బ్యాగ్స్ వల్ల తప్పిన ప్రాణనష్టం

ఎయిర్ బ్యాగ్స్ వల్ల తప్పిన ప్రాణనష్టం

కారులో ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల ప్రాణ నష్టం తప్పినట్లు పరిస్థితులు చూస్తే అర్థం అవుతోంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజ్ తరుణ్‌ ఒక్కడే ఉన్నాడా..? లేక మరెవరైనా ఉన్నారా..? ఉంటే వారికి గాయాలు అయ్యాయా..? అన్నది మాత్రం తెలియరాలేదు. స్థానికులు మాత్రం రాజ్ తరుణ్‌ మాత్రమే ఉన్నాడని అంటున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X