తరుణ్ హీరోగా సుప్రీమ్ రాజు నిర్మించనున్న చిత్రానికి చుక్కలాంటి అబ్బాయి..చక్కనైన అమ్మాయి అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. పౌరుడు చిత్రాన్ని రూపొందించిన రాజ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అస్త్రం సినిమా అనంతరం గ్యాప్ తో సుప్రీం రాజు చేస్తున్న సినిమా కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇది ఇక ప్రత్యేక తరహా ప్రేమ కథ అనీ,తరుణ్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుందని తెలుస్తోంది. జనవరిలో ప్రారంభమయ్యే ఈ సినిమాకు మిగతా తారాగణం ఎంపిక కావాల్సింది.