డ్రగ్స్ రాకెట్ కేసులో వరుణ్ సందేశ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్ కెరీర్ కు ముప్పు వాటిల్లే అవకాశాలు కనపడుతున్నాయి ఇటీవల డ్రగ్ రాకెట్ గుట్టును వెస్ట్ జోన్ పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అనుమానితుడిగా భావిస్తున్న వరుణ్ సందేశ్ కు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) త్వరలో సమన్లను జారీ చేసి ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే కుర్రహీరో వరుణ్ సందేష్ చుట్టూ అల్లు కొన్న ఉచ్చు ఇప్పట్లో వీడేటట్లు కనుబడుట లేదు..వరుణ్ సందేష్ పేరును పరీశీలనలో పెట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సిసిఎస్) ఇంటరాగేట్ చేయనున్నట్టు తాజాగా అందిన సమాచారం. అందుకు గాను యాక్టర్ వరుణ్ సందేష్ ను ఇంటరాగేట్ చేయడానికి సమల్లు జారిచేయుటకు సిద్దంచేస్తున్నారని తాజాగా అందిన సమాచారం...
వరుణ్ సందేశ్ తో పాటు ఈ కేసులో మరికొందరికి సమన్లు జారీ చేసి ప్రశ్నించనున్నట్లు సిసిఎస్ పోలీస్ అదికారి ఒకరు వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ లంగర్ హౌజ్ లో కొకైన్ విక్రయిస్తున్న ఫెడ్రిక్ అనే నైజీరియన్ డాక్టర్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే . అతని దగ్గరున్న 50 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫెడ్రిక్ తో పాటు.. జూ ఆర్టిస్ట్ సిద్దార్థను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అయితే విచారణలో కొన్ని కీలక విషయాలు సిద్దార్థ్ చెప్పినట్లు.. కథనాలు వెల్లడైనాయి..
దీని ఆధారంగానే హ్యాపీడేస్, కొత్తబంగారులోకం ఫేం హీరో వరుణ్ సందేశ్ తో పాటు మరో హీరో.. నేను, డేంజర్ సినిమాల్లో నటించిన అభిషేక్ నిర్మాత రవి ఉప్పల కు ఇప్పటివరకు కొకైన్ అమ్మినట్లు సిద్దార్థ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడని కథనాలు వస్తున్నాయి. అయితే వరుణ్ సందేశ్ మినహా మిగతావారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కూడా రవితేజ్ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే..కాగా టాలీవుడ్ ను ఇటు డ్రగ్స్ కేసులు, సెక్స్ స్కాండల్ కేసులు కుదిపేస్తున్నాయి. టాలీవుడ్ లో మరింకెన్ని అరాచకాలు బయటపడుతాయో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











