twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ రిలీజ్‌కు ఆ రెండు జిల్లాల్లో బ్రేక్!

    |

    మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రానికి ఇబ్బందులు తప్పడం లేదు. సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న వాల్మీకి చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో మాత్రం నిలిచిపోనుంది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

    అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో..

    అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో..

    తమ ఆదేశాలను ధిక్కరించి వాల్మీకి చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు.. వాల్మీకి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    మంత్రి ఫోన్..

    మంత్రి ఫోన్..

    ఇక కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కూడా జిల్లాలో వాల్మీకి సినిమా విడుదలను నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమా థియేటర్లలో వాల్మీకి చిత్రం నిలిపివేయాలంటూ రాష్ట్ర మంత్రి జయరాములు జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు.

    హైకోర్టులోనూ పిటిషన్...

    హైకోర్టులోనూ పిటిషన్...

    కాగా, వాల్మీకి చిత్రం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఆ సినిమా పేరు మార్చాలంటూ వాల్మీకి, బోయలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. సినిమా టైటిల్ తమ కులస్తులను కించపర్చేలా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్ బోర్డ్, ఫిలిం ఛాంబర్ లతోపాటు హీరో వరుణ్ తేజ్, చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోకి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

    English summary
    Tollywood Hero Varun Tej's valmiki not released in two districts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X