For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డ్రగ్స్ తీసుకుంటున్న మిగతా హీరోలెవరు?

  By Srikanya
  |

  Tollywood Heroes In Drug Doubts?
  హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన హీరో అభిషేక్ కుమార్ ఉదతం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ విషయమై గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. అతన్ని కస్టడీకి తీసుకున్న పోలీసుల విచారణలో మరెంతమంది తెలుగు హీరోలు,పరిశ్రమలో వ్యక్తులు పేర్లు బయిటపడనున్నాయో అంటున్నారు. అబిషేక్ నుంచి ఐదు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవటంతో అతను చివరగా ఎవరికి ఫోన్ చేసాడో...ఎవరితో అతనికి పరిచయాలు ఎక్కువ ఉన్నాయో అనే విషయమై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అభిషేక్ కుమార్, అతడి అచరుడ్ని విచారిస్తే, అతడు ఎవవరికి డ్రగ్ సరఫరా చేస్తున్నారు. అన్న వివరాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు.

  గతంలో ..అభిషేక్ పేరు ఒక సారి డ్రగ్స్ విషయంలో బయిటకు వచ్చింది. అప్పుడు అబిషేక్ తో పాటు వరుణ్ సందేష్ పేరు కూడా మీడియాలో వచ్చింది. క్రితం సంవత్సరం జూలైలో హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న జూనియర్ ఆర్టిస్టు నాగసిద్ధార్థతో పాటు నైజీరియన్ ఫ్రెడరిక్‌ను పోలీసులు కొకైన్‌తో హైదరాబాదులోని లంగర్‌హౌస్‌లో పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారించారు. వారి నుంచి 50 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరుణ్ సందేశ్‌, అభిషేక్‌, నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు నాగసిద్ధార్థ పోలీసుల విచారణలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

  అప్పుడు వరుణ్ సందేశ్, అభిషేక్ వారాంతాల్లో డ్రగ్స్‌తో పార్టీలు చేసుకుంటున్నట్లు నాగసిద్ధార్థ చెప్పినట్లు టీవీ ఛానెల్స్ లో వచ్చాయి. ఈ పార్టీలకు ఇతర సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తామని ఆయన చెప్పినట్లు సమాచారం. తన పేరు చెప్పినట్లు వచ్చిన వార్తలను వరుణ్ సందేశ్ ఖండించారు. తనకు చాలా మంది మిత్రులున్నారని, వాళ్ల చరిత్ర తనకు తెలియదని ఆయన అన్నారు. సిద్ధార్థ తనకు తెలుసునని ఆయన అన్నారు. సిద్ధార్థతో తనకు అంత సాన్నిహిత్యం లేదని ఆయన అన్నారు. తాను డ్యాన్స్ ప్రాక్టీసులో ఉన్నానని, అరెస్టు అయితే ఇక్కడ ఎలా ఉంటానని ఆయన అన్నారు. పోలీసులు తనను సంప్రదించలేదని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఫ్రెడరిక్ వద్ద మీ ఫోన్ నెంబర్ ఎలా ఉందని అడిగితే తన ఫోన్ నెంబర్ ఉండడానికి వీల్లేదని అంటూనే తన ఫోన్ నెంబర్ చాలా మంది వద్ద ఉంటుందని సమాధానమిచ్చారు.

  ఇక రిమాండ్‌కు తరలించిన అభిషేక్ ని , తిరిగి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల కస్టడీకి కోరుతూ సోమవారం పిటీషన్ దాఖలు చేస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. అభిషేక్.. తెలుగులో పది చిత్రాలకు పైగా సహాయక పాత్రల్లో నటించారు. సినీరంగంలో పరిచయమైన గొల్ల శ్రీనివాసులుతో కలిసి అభిషేక్ హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లోనూ, హోటళ్లలోనూ మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నారనేది పోలీసుల అభియోగం. అభిషేక్, శ్రీనివాసులుపై ఎస్ఆర్ నగర్ పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం 21(బి) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

  తండ్రి మరణంతో అభిషేక్ చదువు బీకాం రెండో సంవత్సరంలోనే నిలిచిపోయింది. హైదరాబాద్‌కు 1999లో వచ్చి స్థిరపడ్డారు. 2002లో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఐతే, ఎలా చెప్పను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డేంజర్, శశిరేఖా పరిణయం, గమ్యం, కాళిదాసు, గగనం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో శ్రీనివాసులుతో కలిసి ఉంటున్నారు. ఆయన సోదరుడు రాజీవ్ కుమార్ 2009లో హత్యకు గురయ్యారు.

  కొద్దినెలల క్రితం అభిషేక్.. గోవాలో దొరికే కొకైన్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం ప్రారంభించాడు. ఆయనకు గోవాలో 'డ్రాప్ యాంకర్' హోటల్ ఉన్నట్టు చెబుతున్నారు. శ్రీనివాసులు సహాయంతో పలువురు సినీ ప్రముఖులను పరిచయం చేసుకొని 2007 నుంచి మాదక ద్రవ్యాలను అభిషేక్ సరఫరా చేసేవారు. నవంబర్ 11న మాయమైన అభిషేక్.. డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్‌కు వచ్చారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకొని పెద్దఎత్తున కొకైన్ తీసుకొని వచ్చినట్టు చెబుతున్నారు. ఏదైమైనా అభిషేక్ వ్యవహారంతో మరికొంత మంది జాతకాలు బయిటపడతాయో లేక ఎప్పటిలాగే రెండురోజుల తర్వాత కేసు క్లోజ్ అయిపోతుందో చూడాలి.

  English summary
  The number of drug peddlers, brokers and consumers found within Tollywood has the police worried. Primarily because they fear the drug mafia may spread its tentacles to arms smuggling ,murders and thefts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X