పోలీస్ డ్రస్ లో ఏ హీరో బాగున్నాడు? (ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ : ఇది పోలీస్ సినిమాల సీజన్. పోలీస్‌ సినిమాలంటే మాస్‌ని ఆకట్టుకోవడం కోసమే అనేది పాత మాట. వాటిని కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా తీర్చిదిద్దవచ్చు. వినోదం, భావోద్వేగాలూ జోడిస్తే అందరినీ ఆకట్టుకోవడం తేలికే అంటున్నారు దర్శక,నిర్మాతలు .పోలీస్‌ కథలు ఓ బ్రాండ్‌ అయిపోయాయి. మాస్‌ హీరోగా మన్ననలు అందుకొన్న ప్రతీ హీరో.. ఎప్పుడో ఒకప్పుడు పోలీస్‌గా దర్శనమిచ్చినవాడే. అందుకే పోలీస్‌ కథలు ఎవర్‌గ్రీన్‌.

'గబ్బర్‌సింగ్‌', 'దూకుడు' సినిమాలు ఘన విజయం సాధించాయంటే కారణం అదే. దర్శకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీస్‌ కథల అంతఃసూత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మంచి పోలీస్‌ - చెడు వ్యవస్థ మీద పోరాటం చేయడం. అదెలా? అనేది ఆసక్తికరంగా చెప్పగలిగితే... ఈ కథలు ఎన్నిసార్లయినా చూడొచ్చు'' అని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.

తెలుగు సినిమా రికార్డులు బద్దలు కొట్టిన 'పోకిరి ' పోలీసే. వాటిని తిరగరాసిన 'గబ్బర్‌ సింగ్‌' కూడా ఖాకీ వాలానే. అందుకే తెలుగు హీరోలు...ఎప్పుడెప్పుడు లాఠీ పట్టేసుకొని ఠీవీగా నడిచొచ్చేద్దామా.. అని ఆశపడుతుంటారు. ఈసారి స్టార్ హీరోలంతా ఇలాంటి కథలపై దృష్టిసారించడం ఆసక్తిరేకెత్తిస్తోంది.

పోలీసులైన హీరోలు స్లైడ్ షోలో...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

'నా తిక్కేంటో చూపిస్తా - అందరి లెక్కలూ తేలుస్తా..' అంటూ 'గబ్బర్‌సింగ్‌'లో పవన్‌ చేసిన మాయ అంత త్వరగా మర్చిపోయేది కాదు. పోలీస్‌ స్టేషన్‌లో అంత్యాక్షరి ఆడించిన ఘనత ఆయనదే. పోలీస్‌ పాత్రలో తిక్క చేర్చి.. ఆ సినిమాని హిట్‌ చేశారు. ఆ బ్రాండ్‌ ఇమేజ్‌తోనే 'గబ్బర్‌సింగ్‌ 2'కి రూపకల్పన చేశారు.

మహేష్ బాబు

మహేష్ బాబు

'మజాక్‌ చేయడానికి నేను నీ సాలేగాడ్ని అనుకొన్నావా... పోలీస్‌స్‌స్‌స్‌స్‌స్‌స్‌' అంటూ మహేష్‌బాబు కూడా తన 'దూకుడు' చూపించేశారు. అదే టీమ్‌ 'ఆగడు' కోసం పనిచేస్తోంది. ఇందులోనూ ఆయన పోలీస్‌ ఆఫీసరే.

రవితేజ

రవితేజ

'విక్రమార్కుడు'లో జింతాత ఆడేసిన పోలీస్‌.. రవితేజ. ఇప్పుడు తన పోలీస్‌ 'పవర్‌'ని మరోసారి చూపించబోతున్నారు. 'విక్రమార్కుడికి మించిన వినోదం మా సినిమాలోనూ ఉంటుంది..' అని ఆ చిత్రబృందం ముందునుంచే వూరించేస్తోంది.

జూ.ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్


'బాద్‌షా'లో కొన్ని సెకన్లపాటు ఖాకీ డ్రస్సులో కనిపించారు ఎన్టీఆర్‌. పూరిజగన్నాథ్‌ చిత్రంలో మాత్రం ఆయన పూర్తిస్థాయి పోలీస్‌గా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

'హరేరామ్‌'లో పోలీస్‌గా చేసిన కల్యాణ్‌రామ్‌ కూడా పోలీస్‌ అయిపోయారు. 'పటాస్‌' కోసం.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

మొన్నామధ్య 'రేసుగుర్రం'లా పరిగెట్టిందీ పోలీస్‌ సినిమానే. అదీ.. పోలీస్‌ కథలకున్న సత్తా. అందుకే ఇప్పుడు తెలుగులో ఖాకీ కథలు మళ్లీ కళకళలాడుతున్నాయి.

చిరంజీవి

చిరంజీవి

ఎస్పీ పరుశరామ్ చిత్రంలో చిరంజీవి పోలీస్ గా అదరకొట్టిన సంగతి గుర్తున్నదే.
8

వెంకటేష్

వెంకటేష్

ఘర్షణ చిత్రంలో ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గానూ, ఈనాడు చిత్రంలో పోలీస్ కమీషనర్ గానూ కనిపించి అలరించాడు.

 బాలకృష్ణ

బాలకృష్ణ

లక్ష్మీ నరసింహ చిత్రంలో బాలకృష్ణ ..పోలీస్ గా నట విశ్వరూపం చూపించటం మర్చిపోగలమా.

సూర్య

సూర్య


సింగం, యముడుగా సూర్య తెలుగులో పోలీస్ గెటప్ లో అదరకొట్టారు. ఆయన గెటప్ కే వందకు వంద శాతం మార్కులు పడ్డాయి.

దగ్గుపాటి రానా

దగ్గుపాటి రానా

సినిమా హిట్ కాకపోయినా, తెలుగులో విడుదల కాకపోయినా డిపార్టమెంట్ చిత్రంలో దగ్గుపాటి రానా..పోలీస్ గా బాగా సూట్ అయ్యారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్ హిందీ చిత్రం జంజీర్ రీమేక్ తెలుగు వెర్షన్ ...తుఫాన్ లో పోలీస్ అధికారిగా కనిపించారు.

సుదీప్

సుదీప్

ఈగ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన సుదీప్ కన్నడంలో యముడు రీమేక్ లో చేసారు. ఆయన పోలీస్ గెటప్ కి మంచి అప్లాజ్ వచ్చింది.

శింబు

శింబు

శింబుతమిళ హీరో శింబు సైతం చాలా చిత్రాల్లో పోలీస్ గా కనిపించారు. ముఖ్యంగా దబాంగ్ రీమేక్ వెర్షన్ లోనూ ఆయన పోలీస్ గా అలరించారు.

సునీల్

సునీల్

తఢాఖా చిత్రంలో సునీల్ ..పోలీస్ గా కనిపించారు. అమాయికత్వం కనపడే అతని పాత్ర సినిమా ప్లస్ పాయింట్ లలో ఒకటిగా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X