అలాంటి హీరోయిన్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడే
టాలీవుడ్ లో ఓ వూపు ఊపిన హీరోయిన్లంతా...బాలీవుడ్ లో ప్రవేశించాలని కోరుకోవడం చాలా కామన్. ఎందుకంటే బాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్లలో చాలా మంది టాలీవుడ్, సౌత్ సినిమాల్లో చేసి అందనంత ఎత్తుకు ఎదిగన వారే. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ప్రస్తుతం బాలీవుడ్ అంటేనే జంకుతున్నారు టాలీవుడ్, సౌత్ భామలు. ఇప్పటి పరిస్థితుల్లో... అప్పటి పరిస్థితుల్లో చాలా తేడా రావడమే ఇందుకు కారణం. దీంతో ఇక్కడి నుంచి వెళ్లి శ్రీదేవీ మాదిరి వెలిగి పోదామనుకుంటున్న తారలు ఇప్పడు అలాంటి సాహసాలు చేయడం లేదు.
ఇక్కడ ఓ వెలుగు వెలిగి ఇలియాన, త్రిష, జెనిలియా లాంటి హీరోయిన్లు బాలీవుడ్ బాట పట్టి అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటున్నారు. కొన్ని రోజులకే ఫామ్ కోల్పోతున్నారు. మళ్లీ వెనక్కి వచ్చి చూసుకుంటే కొత్త హీరోన్ల ఫోటీని తట్టుకోవడం వారికి కష్టం అవుతోంది. దీంతో రెంటికీ చెడ్డ రేవడి అవుతోంది వారి పరిస్థితి.
అందుకే బాలీవుడ్ బాట పట్టడానికి అంతగా ఇష్ట పడటం లేదు కొందరు భామలు. కారణం ఏమిటని ఇలియానా లాంటి వారిని ప్రశ్నిస్తే.....తమను హిందీ జనాలు పట్టించుకోవడం లేదనే విషయాన్ని దాచి, ఇక్కడి మాదిరి అక్కడ హీరోయిన్ల ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు, అందుకే బాలీవుడ్ అంటే నచ్చడం లేదు అంటూ ఏవో కుంటి సాకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











