లీగల్ వివాదంలో తమన్నా

By Staff

Tamanna
హ్యాపీడేస్ సినిమాతో పాపులర్ అయిన తమన్నా ఇప్పుడో న్యాయ వివాదంలో చిక్కుకుంది.ఆమె మూడేళ్ళ క్రిందట అంటే అంతగా ఎదగని రోజుల్లో ఓ తమిళ సినిమా నిమిత్తం యాభై వేలు అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయ్యింది. ఆ సినిమా పేరు మదన్.దానికి నటుడు-దర్శకుడు అయిన జై ఆకాష్ డైరక్టర్. ఆ సినిమా అప్పట్లో కొన్ని ఆర్ధిక కారణాల వల్ల ఆగిపోయింది.అయితే ఇప్పుడా దర్శకుడు మళ్ళి ఆ సినిమా చెయ్యాలనుకుంటూ రెండు వారాల క్రింతం తమన్నాని డేట్స్ అడిగాడు.

ఆమె ఇప్పటి క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే ప్రయత్నం గమనించిన తమన్నా సారి చెప్పి యాభై వేలు తిరిగి రీ పే చేస్తానంది. కానీ ఆ దర్శకుడు ఒప్పుకోక నడిగర సంఘంలో ఆమెపై కంప్లైంట్ చేసాడు.తనకి డేట్స్ ఖాళీ లేవని,అంతేగాని అతని సినిమాల్లో చేయకూడదు అని కాదని ఆమె చెప్పుకొచ్చింది.అయినా ఆ దర్శకుడు వదిలేటట్లు కనపడటం లేదు.

ఇస్తే డేట్స్ లేదా..పరిహారంగా ఎక్కువ ఎమౌంట్ ఇవ్వాలని అతను పట్టుపడుతున్నాడు. ఇక అతని నిర్ణయానికి ఆమె డేట్స్ దొరకని కొందరు తమిళ దర్శక,నిర్మాతలు కూడా సపోర్టు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి కెరీర్ ప్రారంభంలో తెలియక తీసుకుని తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎంత ఇబ్బంది పడాల్సి వస్తోందో కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X