యంగ్ హీరోలకి సైరా ఫీవర్.. టీజర్ గురించి బన్నీ, నాని, తేజు, వరుణ్ ఏమన్నారంటే!
Recommended Video

సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదలైంది. మెగా అభిమానుల్లో పండుగ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిగా కనిపిస్తున్నాడు. పోరాట యోధుడిగా చిరంజీవి లుక్ అదిరిపోయింది. అద్భుతమైన విజువల్స్ తో మెగాస్టార్ ని బాగా చూపించారు. సైరా చిత్రం ఎలా ఉండబోతోంది అనడానికి ఇది శాంపిల్ మాత్రమే. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ అభిమానులనే కాదు టాలీవుడ్ యువహీరోలని సైతం అలరిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరోలు టీజర్ గురించి ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమా ఎవరిది
నేచురల్ స్టార్ నాని సైరా టీజర్ పై స్పందించాడు. ఈ సినిమా ఎవరిది? మనది అంటూ ట్వీట్ చేశాడు. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి. ఆయన జీవిత చరిత్రపై తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో నాని మన సినిమా అంటూ స్పందించాడు.
రోమాలు నిక్కబొడుచుకునేలా
టీజర్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఈ సినిమా కచ్చితంగా చరిత్ర సృష్టిస్తుంది అని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. టీజర్ డేట్ ప్రకటించినప్పటి నుంచి వరుణ్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.
సాయిధరమ్ తేజ్
సైరా టీజర్ చరిత్ర సృష్టించే విధంగా ఉంది. మెగాస్టార్ కళ్ళు చూస్తుంటే ఈ చిత్రం ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు . ఇలాంటి అద్భుతమైన టీజర్ అందించిన సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కు కృతజ్ఞతలు అని తేజు ట్విట్టర్ లో స్పందించాడు.
మైండ్ బ్లోయింగ్ అంటూ బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైరా టీజర్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక మాటలు లేవు. మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











