పెళ్లి మీద పెళ్లి...పవన్ కళ్యాణ్ కంటే ముందు ఇంకెవరెవరు?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లి మీద పెళ్లి చేసుకుని అటు మీడియాను ఇటు అభిమానులను, యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. పెళ్లి మీద పెళ్లి చేసుకోవడం సినిమా రంగంలో సర్వ సాధారణం. గతంలో చాలా మంది స్టార్స్ ఇలానే రేండేసి, మూడేసి, నాలుగేసి వివాహాలు చేసుకున్నారు.

ఇదే విషయాన్ని పలువురు పవన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇందులో రాద్దాంతం చేయాల్సిన విషయం ఏమీలేదని, విమర్శించాల్సిన విషయమూ కాదని అభిప్రాయ పడుతున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.....మన తెలుగు సమాజం మాత్రం పెళ్లి మీద పెళ్లి చేసుకునే సంస్కృతిని ఆమోదించదనేది విస్పష్టం. అదే సమయంలో చట్టబద్దంగానే మూడు వివాహాలు చేసుకున్న పవన్ కళ్యాణ్‌ను తప్పు పట్టాల్సిన అసరమూ లేదు.

గతంలో ఒకటికంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న స్టార్స్ అనేక మంది ఉన్నారు. ప్రముఖ తమిళ నటుడు ఎంజీ గణేశన్ ఏకంగా నాలుగు వివాహాలు చేసుకున్నారు. తొలుత ఆయన అలమేలును, ఆ తర్వాత పుష్పవల్లిని, అనంతరం తెలుగు నటి సావిత్రిని, ఆ తర్వాత 79 ఏట విదేశీ మహిళ జూలియాను పెళ్లాడారు. తెలుగు నటుడు నాగార్జున ఇప్పటి వరకు రెండు వివాహాలు చేసుకున్నారు. తొలుత ఆయన రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లాడారు. ఆమెతో విడిపోయి తనతో పాటు సినిమాల్లో నటించిన అమలను రెండో వివాహం చేసుకున్నారు.

ఇలా చెప్పుకుంటే పోతే ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గమనించ దగిన విషయం ఏమిటంటే....ఇలా పెళ్లి మీద పెళ్లి చేసుకున్న స్టార్స్ అంతా బాగా పాపులారిటీ ఉన్న వారే. అదే సమయంలో ఇలాంటి విషయాలు వారి కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపక పోగా వారికి పబ్లిసిటీ పెంచిన సందర్బాలు అనేకం.

పవన్ కళ్యాణ్ తొలుత నందిని అనే అమ్మాయిని 1997లో వివాహం చేసుకున్నారు. ఆమెతో విడిపోయిన పవన్ తన సహ నటి రేణుదేశాయ్‌కు దగ్గరయ్యాడు. 2009లో ఆమెను వివాహం చేసుకున్నాడు. తాజాగా సెప్టెంబర్ 30, 2013న విదేశీ భామ అన్నా లెజెనివాను పెళ్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X