For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ మూవీస్ 2019 : బాక్సాఫీస్ దాహాన్ని తీర్చని స్టార్ హీరోలు.. టాప్ గ్రాస్ సాధించినవి ఇవే

  |

  కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. గడిచిన ఈ ఏడాదిని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఎన్నో జ్జాపకాలు వెంటాడుతున్నాయి. కొందరు హీరోలకు కొన్ని పీడకలల్లా వేధిస్తుంటే.. మరి కొందరికి తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. మొత్తానికి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ప్యాన్ ఇండియాగా తెరకెక్కించిన చిత్రాలు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ ఏడాది బాక్సాఫీస్ గ్రాఫ్ ఎలా ఉందో అన్నది ఓ సారి చూద్దాం..

  మొదటి అడుగే పరాజయం..

  మొదటి అడుగే పరాజయం..

  మొదటి అడుగులోనే విజయం కనిపిస్తుందని అంటారు. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్ చరణ్-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు దాదాపు యాభై శాతం నష్టాలను మిగిల్చినట్టు టాక్. ఇక ఈ రెండు చిత్రాలపై వచ్చిన ట్రోల్స్ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది.

  కాపాడిన ఎఫ్2, మహర్షి..

  కాపాడిన ఎఫ్2, మహర్షి..

  ప్రథమార్థంలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రాకపోవడం, రామ్ చరణ్, బాలయ్య సినిమాలు బోల్తా కొట్టడంతో ప్రథమార్థంపై పెద్ద దెబ్బ కొట్టినట్టైంది. ఆపై వచ్చిన వెంకీ-వరుణ్ మల్టీ స్టారర్ ఎఫ్2కు బాగానే కలిసి వచ్చింది. సంక్రాంతి సీజన్ మొత్తాన్ని వాడుకున్న ఈ చిత్రం టాప్ 10లో చోటు దక్కించుకుంది. దాదాపు 137కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు టాక్. ఇక సూపర్ స్టార్ మహేష్ మహర్షి చిత్రం వచ్చి ప్రథమార్థాన్ని కాస్త గట్టెక్కించినట్టైంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా.. దాదాపు 175కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు సమాచారం.

  మీడియం రేంజ్ చిత్రాల హవా..

  మీడియం రేంజ్ చిత్రాల హవా..

  మజిలీ, జెర్సీ, గద్దలకొండ గణేష్, ఓ బేబి సినిమాలు మంచి వసూళ్లను సాధించి టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో సమంతకు చెందిన రెండు సినిమాలుంటం విశేషం. లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఓ బేబీ సైతం మంచి వసూళ్లను సాధించడం మంచి విషయం. జెర్సీ సినిమాతో నాని, గద్దలకొండ గణేష్ చిత్రంతో వరుణ్ తేజ్ మంచి ఫామ్‌లోకి వచ్చారు.

  #ThisHappened2019 : Best Tollywood Movies Of 2019 || Filmibeat Telugu
  చిన్న చిత్రాలకు గుర్తింపు..

  చిన్న చిత్రాలకు గుర్తింపు..


  ఈ ఏడాదిలో చిన్న చిత్రాలు బాగానే క్లిక్ అయ్యాయి. బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఫలక్‌నుమా దాస్ లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. బ్రోచెవారెవరురాతో హిట్ కొట్టిన శ్రీ విష్ణు తిప్పరామీసం చిత్రంతో బోల్తా కొట్టాడు. ఏజెంట్, ఫలక్‌నుమాదాస్ చిత్రాలు పెట్టిన ఖర్చును రాబట్టి.. లాభాలను గడించాయని టాక్.

  నిరాశ పరిచిన సాహో, సైరా..

  నిరాశ పరిచిన సాహో, సైరా..

  భారీ ఎత్తున విడుదల చేసిన సాహో, సైరాలు అంతగా ప్రభావం చూపకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ చేస్తాయని అని ఆశించిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పతనం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. పెట్టిన లాభాలను తీసుకురావడానికి చాలా కష్టపడ్డాయి. ఈ రెండు చిత్రాలతో ద్వితీయార్థంపై ఆశలు పెట్టుకోగా.. అవి కాస్త బూడిదలో పోసిన పన్నీరులా అయింది. సాహో దాదాపు వెయ్యి కోట్లను కొల్లగొడుతుందని అందరూ భావిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 433కోట్ల గ్రాస్‌తో సరిపెట్టుకుందని తెలుస్తోంది. ఇక సైరా చిత్రం 250కోట్లతో తట్టా బుట్టా సర్దుకుందని సమాచారం.

  బాక్సాఫీస్ దాహం తీరకుండానే..

  బాక్సాఫీస్ దాహం తీరకుండానే..

  ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య, రామ్ చరణ్ పెద్ద దెబ్బ కొట్టగా.. ప్రభాస్, చిరంజీవిలు తమ స్టామినాను అంతగా నిరూపించుకోలేకపోయారు. అయితే నాగ చైతన్య, నాని, రామ్, సమంత, వరుణ్ తేజ్, వెంకటేష్ లాంటి వారు పుంజుకుని తమ సత్తాను చాటారు. కానీ వీరెవరూ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా విజృంభించలేదు. ఇక వచ్చే ఏడాది రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రమైనా బాక్సాఫీస్ దాహాన్ని తీర్చుతుందో లేదో చూడాలి.

  English summary
  Highest worldwide gross of 2019. Highest Top Gross Of Tollywood Movie In 2019 Are Saaho, Sye Raa, Maharshi, F2 Are AT Top Place.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X