twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు ప్రేక్షకులకు శుభవార్త.. లాక్‌డౌన్ ఎత్తివేస్తే బంపర్ ఆఫర్లు.. అవేమిటంటే

    |

    కరోనావైరస్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీలు కుదేలయ్యాయి. సినిమా హాళ్ల మూత పడటంతో నిర్మాతలు, ప్రేక్షకుల్లో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ ఎప్పుడు ముగుస్తుందో.. హాళ్లకు పరుగులు పెడుదామనే ఆశతో ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను థియేటర్ల వద్దకు తీసుకెళ్దామనే ఆశాభావంతో నిర్మాతలు చూస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత సురేష్ బాబు ఓ చక్కటి వార్తను చెప్పారు. అదేమిటంటే..

    వేసవి కోసం సినిమాలు సిద్దం

    వేసవి కోసం సినిమాలు సిద్దం

    తెలుగు సినిమా పరిశ్రమకు వేసవి కాలం వచ్చిందంటే మంచి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే భారీ సంఖ్యలో స్టార్ హీరోల సినిమాలను సిద్ధం చేశారు. కానీ కరోనావైరస్ కారణంగా సినిమా హాళ్లు మూత పడటంతో నిర్మాతలకు షాక్ తగిలినట్టయింది.

    రూ.500 కోట్ల నష్టం

    రూ.500 కోట్ల నష్టం

    అయితే తెలుగు సినిమా పరిశ్రమకు మార్చి నుంచి జూన్ వరకు సినిమా పరిశ్రమ వాయిదా పడటం వలన ఊహించని నష్టాలు వచ్చే పరిస్థితి ఉందని పలువురు నిర్మాతలు చెబుతున్నారు. కేవలం టాలీవుడ్‌పైనే దాదాపు రూ.500 కోట్ల నష్టం వాటిల్లే పరిస్థితి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?

    ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?

    ఇక మే నెలలోనో, లేదా జూన్‌లోనే సినిమాలు విడుదలయితే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రాకపోతే భారీ సినిమాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలకు కూడా వస్తున్నాయి. కరోనా భయాలు ఇప్పట్లో ప్రేక్షకులను వదిలేట్టు కనిపిస్తున్న నేపథ్యంలో అందుకు తగినట్టుగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    డీ సురేష్ బాబు సంచలన ప్రకటన

    టాలీవుడ్‌లో ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొంటూ నిర్మాత డీ సురేష్ బాబు ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రతయ్నాలు చేస్తున్నాం. లాక్ డైన్ తర్వాత టికెట్ల రేట్లను తగ్గించే విధంగా నిర్ణయం తీసుకోవాలని అనుకొంటున్నాం. తెలుగు ప్రేక్షకులు వినోదానికి పెద్ద పీట వేస్తారు. థియేట్రికల్ ఎక్సీపిరియెన్స్‌ను పొందడానికే మొగ్గు చూపుతారు అని ఆయన అన్నారు.

    Recommended Video

    Pawan Kalyan's Vakeel Saab Work From Home For Dubbing Works
    రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు

    రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు


    లాక్‌డౌన్ ఎత్తివేసిన వెంటనే రిలీజ్‌కు సిద్దంగా ఉన్న చిత్రాల జాబితా బాగానే ఉంది. అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్దం, నానీ, సుధీర్ బాబు నటించిన వీ సినిమా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాలు రెడీగా ఉన్నాయి. అలాగే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, వెంకటేష్ నారప్ప, రవితేజ క్రాక్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

    English summary
    Tollywood industry is struggling to Coronavirus lockdown. Ticket prices to drop down in theaters, post #lockdown. Our audience are very much fond of entertainment & won't stop loving the Theatrical experience of watching a movie, says Producer #Suresh Daggubati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X